Minister Satya Kumar Yadav Watched Chhaava Movie :ఛత్రపతి శివాజీ, శంభాజీలాంటివారిపై మరిన్ని సినిమాలు రావాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఏడున్నరేళ్ల తర్వాత థియేటర్‌కు వచ్చి ‘ఛావా’ చిత్రం చూశానని మంత్రి తెలిపారు. శంభాజీ సినిమా చూశాక ఒక వీరుడి సినిమా చూశాననే ఆనందం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఒక వీరుడి ముగింపు అలా జరిగినందుకు వేదనగా ఉందన్నారు. వ్యాపారం కోసం స్మగ్లర్లను హీరోలుగా చూపించే చిత్రాలు తీయవద్దని సూచించారు.
అలాంటి సినిమాలు వద్దు :ఛత్రపతి శివాజీ, శంభాజీ మహారాజ్లను మొదటి స్వాతంత్య్ర యోధులుగా చెప్పాలని మంత్రి స్పష్టంచేశారు. సమకాలీన చరిత్రకారుల పైన సినిమా తీయాలన్నారు. అంతేగాని హీరోలు గంజా, డ్రగ్స్ తీసుకునేవి చూపించకూడదని తెలిపారు. వీరసావర్కర్ వర్ధంతి సందర్భంగా మరొక వీరుని సినిమా చూశానని వెల్లడించారు.