Minister Bhatti on Dharani Issues : గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో(Dharani Portal) సామాన్యులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఎంతో మంది తమ అవసరాల కోసం సొంత భూమిని కూడా అమ్ముకోలేకపోతున్నారని, పిల్లల పెళ్లిళ్లు చదువులకు ఇతర అవసరాలను తీర్చుకోలేక తీవ్ర ఆవేదన చెందుతున్నారని దుయ్యబట్టారు. ధరణి కొంతమందికి భరణంగా, మరికొంత మందికి ఆభరణంగా చాలా మందికి భారంగా మారిందని విమర్శించారు.
రూ.2.75 లక్షల కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ - ఏ శాఖకు ఎంతంటే?
Telangana vote on account Budget : ఇదంతా లోపభూయిష్టమైన ధరణి పోర్టల్ కారణంగానే జరిగిందని. ఇప్పుడు తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రికార్డులు పరిశీలించిన మీదట, ఇది నిజమేనని తేలిందన్నారు. అందుకే ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ సర్కారు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందన్నారు. ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు సత్వర చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించామన్నారు.