Margadarsi 120 Branch Launched : చిట్ఫండ్ రంగంలో దూసుకుపోతున్న మార్గదర్శి చిట్ఫండ్ దక్షిణాదిన మరో శాఖను ప్రారంభించింది. తమిళనాడులోని హోసూరులో 120వ శాఖను మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ ప్రారంభించారు. ఆ తర్వాత సిబ్బంది, చందాదారులతో మాట్లాడారు. చాలా ఏళ్లుగా సంస్థతో కలిసి నడుస్తున్నామని హోసూరులో బ్రాంచ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చందాదారులు చెప్పారు. చందాదారులు చూపుతున్న ఆదరణతోనే విస్తరణ సాధ్యమైందని మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ తెలిపారు. ఇవాళ ఉదయం బెంగళూరు సమీపంలోని కెంగేరిలో 119 వ బ్రాంచ్ ప్రారంభించామని చెప్పారు. కస్టమర్లకు మరింత నాణ్యమైన సేవలందిస్తూ, చందాదారుల జీవితాల్లో సంతోషం నింపడమే లక్ష్యమని పేర్కొన్నారు.
"హోసూరులో 120వ బ్రాంచ్ ప్రారంభించాం. ఇప్పటికే హోసూరు నుంచి చాలామంది చందాదారులు ఉన్నారు. సమీపాన ఉన్న బెంగళూరు బ్రాంచుల్లో చందాదారులుగా చేరారు. తమిళనాడులో ఇది 18వ బ్రాంచ్, మా సంస్థకు 120వ బ్రాంచ్. ఈ రోజు ఉదయం కెంగేరిలో 119వ బ్రాంచ్ ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో కలిపి మార్గదర్శికి 3 లక్షల మంది చందాదారులు ఉన్నారు. కొందరికి మూడు, నాలుగు చిట్‌లు కూడా ఉన్నాయి. వివిధ వృత్తుల వారు, ఉద్యోగులు, అన్నివర్గాల వారు చిట్‌లు వేస్తున్నారు. మా సేవల పట్ల చందాదారులు చాలా నమ్మకంతో, సంతృప్తితో ఉన్నారు"- శైలజాకిరణ్, మార్గదర్శి ఎండీ