Margadarsi Chit Funds Opened New Branch in Chikkaballapur Karnataka :తెలుగువారికి సుపరిచితమైన మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ కర్ణాటకలోని చిక్‌బళ్లాపురలో నూతన బ్రాంచ్‌ని ప్రారంభించింది. మార్గదర్శి సంస్థకు మొత్తంగా ఇది 115వ బ్రాంచ్. ప్రారంభ కార్యక్రమంలో మార్గదర్శి సంస్థ ఎండీ శైలజా కిరణ్ పాల్గొన్నారు. జ్యోతి వెలిగించి నూతన బ్రాంచ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో మార్గదర్శి సంస్థ అధికారులు, సిబ్బంది, ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆ తర్వాత మొదటి ఖాతాదారు నుంచి నగదు స్వీకరించిన శైలజా కిరణ్ రశీదును అందించారు. మార్గదర్శి సంస్థలో చిట్స్ వేయడం ఎంతగానో ఉపయుక్తంగా ఉందని ఖాతాదారులు స్పష్టం చేశారు. బ్యాంకులతో పోలిస్తే సులభంగా తాము డబ్బును పొందుతున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా తమకు ఆర్థిక అండగా నిలిచిందని కొనియాడారు.
మార్గదర్శి సంస్థలో చిట్స్ వేయడం ఎంతగానో ఉపయుక్తంగా ఉందని ఖాతాదారులు స్పష్టం చేశారు. బ్యాంకులతో పోలిస్తే సులభంగా తాము డబ్బును పొందుతున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా తమకు ఆర్థిక అండగా నిలిచిందని కొనియాడారు. వేల కుటుంబాలు చిట్స్ కడుతున్నాయన్న ఖాతాదారులు డబ్బు తీసుకునేటప్పుడు తమకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని స్పష్టం చేశారు. మార్గదర్శి సంస్థకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పారు.