ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంచెలంచెలుగా విస్తరణ - నమ్మకానికి చిరునామాగా 'మార్గదర్శి'

ఇవాళ నూతనంగా రెండు బ్రాంచ్​లను ప్రారంభించనున్న మార్గదర్శి చిట్​ఫండ్​

Margadarsi Branch at Kengeri
Margadarsi Branch at Kengeri (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 7 hours ago

Margadarsi Branch at Kengeri :నమ్మకానికి చిరునామాగా మార్గదర్శి చిట్​ఫండ్స్ నిలిచింది. సవాళ్లకు ఎదురునిలిచి లక్షలమంది ఆర్థికనేస్తంగా ఖాతాదారుల మనస్సుల్లో ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. కలలు మీవి, వాటికి సాకారం చేసే ఆర్థిక సహకారం మాది అంటూ నిరంతరాయంగా, నిర్విరామంగా సేవలు అందిస్తూ వస్తోంది. ఇంటి నిర్మాణం, వ్యాపార ప్రారంభం, విస్తరణ, పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, చింతలేని పదవీవిరమణ జీవితం ఇలా అవసరమేదైనా అందరి ఏకైక ఎంపికగా నిలిచింది మార్గదర్శి. ఈ క్రమంలోనే తన 119వ బ్రాంచ్​ను కర్ణాటకలో కెంగెరీలో, 120వ శాఖను తమిళనాడులోని హోసూర్‌లో ఇవాళ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

కెంగేరి, హోసూర్​లో శాఖల ప్రారంభంతో మార్గదర్శి చిట్​ఫండ్స్ కర్ణాటక, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అంతటా తన పరిధిని విస్తరిస్తోంది. అంతేకాకా చందాదారుల ఆర్థిక ఆకాంక్షలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. కెంగేరి, హోసూర్​లో బ్రాంచ్​లను ప్రారంభించడం అనేది తమ లక్ష్యంలో ఒక ముఖ్యమైన ముందడుగుని మార్గదర్శి సంస్థ ఎండీ శైలజా కిరణ్ అన్నారు. కర్ణాటక ప్రజలకు ఆర్థిక స్వాతంత్య్రం మరింత చేరువైందని ఆమె చెప్పారు.

Margadarsi Branch in Hosur :తమిళనాడులోని హోసూర్​లో కొత్త శాఖతో తమ చందాదారులకు సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు శైలజా కిరణ్ పేర్కొన్నారు. అదేవిధంగా ఖాతాదారుల లక్ష్యాలను సాధించేందుకు ఎల్లప్పుడూ సురక్షితమైన, పారదర్శకమైన విలువలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. క్రమశిక్షణతో కూడిన పొదుపు ఎంపికలను అందిస్తున్నట్లు తెలిపారు. విశ్వసనీయతకు మారుపేరుగా మార్గదర్శి నిలిచిందని శైలజా కిరణ్ స్పష్టం చేశారు.

మార్గదర్శి చిట్​ఫండ్స్ 1962లో ప్రారంభమైందని శైలజా కిరణ్ గుర్తుచేశారు. 60 లక్షలకు పైగా ఖాతాదారులకు సేవలందిస్తోందని పేర్కొన్నారు. అలాగే సంస్థ రూ.9,396 కోట్ల టర్నోవర్​ సాధించిందని వివరించారు. ఆరు దశాబ్దాలకుపైగా చందాదారుల కలలను సాకారం చేయడంలో తమ వంతు పాత్ర పోషించినట్లు తెలిపారు. ఇవాళ ఈ రెండు శాఖలను ప్రారంభించడం అనేది తమ ప్రయాణంలో మరో అడుగుని శైలజా కిరణ్ వెల్లడించారు.

మార్గదర్శి చిట్​ఫండ్స్ సేవలు :

  • స్థాపించిన సంవత్సరం : 1962
  • చందాదారులు : ఇప్పటి వరకు 60 లక్షలకు పైగా సేవలు
  • సంచిత వేలం టర్నోవర్ : రూ. 9,396 కోట్లు
  • బ్రాంచ్ నెట్‌వర్క్: కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అంతటా 120 శాఖలు

కర్ణాటకలోని చిక్‌బళ్లాపురలో మార్గదర్శి చిట్స్ 115వ బ్రాంచ్ ప్రారంభం - MARGADARSI BRANCH AT CHIKKABALLAPUR

మార్గదర్శి మరో మైలురాయి- కోయంబత్తూరులో 114వ బ్రాంచి ప్రారంభం - margadarshi branch

ABOUT THE AUTHOR

...view details