తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికల శిక్షణకు 10 మంది అధికారులు డుమ్మా- క్రిమినల్ కేసులు నమోదు - Criminal Cases Against Absent Staff

Criminal cases On Election Training Absent Staff : పార్లమెంట్ ఎన్నికల శిక్షణ తరగతులకు అధికారులు, సిబ్బంది గైర్హాజరు కావడంపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ సీరియస్ అయ్యారు. శిక్షణ తరగతులకు హాజరవ్వని 10 మంది అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గైర్హాజరైన వారికి ఈ నెల 20న మరోసారి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Criminal cases On Election Training Absent Staff
Criminal cases On Election Training Absent Staff

By ETV Bharat Telangana Team

Published : Apr 18, 2024, 9:10 PM IST

Criminal Cases On Election Training Absent Staff : లోక్​సభ ఎన్నికల విధుల కోసం ఎంపిక చేసిన అధికారులు, సిబ్బంది శిక్షణ తరగతులకు గైర్హాజరు కావడం పట్ల హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ కన్నెర్ర చేశారు. శిక్షణ తరగతులకు గైర్హాజరైన 10 మంది అధికారులు, సిబ్బందిపై ఆర్పీ యాక్ట్ 1951 సెక్షన్ 134 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Criminal Cases On 10 Officials :క్రిమినల్ కేసులు నమోదైన వారిలో రిజిస్ట్రార్ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్​గా పనిచేస్తున్న సయ్యద్ ఇలియాస్ అహ్మద్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉమెన్ క్యాంపస్ సీనియర్ అసిస్టెంట్ రవి ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జె. కృష్ణయ్య, పాఠశాల విద్య విభాగంలో జూనియర్ అసిస్టెంట్ మజీద్ ఖాన్, కాజిపురా ప్రభుత్వ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ మీర్జా నసీర్ బేగ్, పంజాగుట్ట డివిజన్​లోని వాణిజ్య పన్నుల శాఖ డీఎస్టీవో నాగరాజు, జూనియర్ అసిస్టెంట్ మధుసూదన్ కుమార్, బార్కస్ లోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు సయ్యద్ అబ్దుల్లా, జూనియర్ అసిస్టెంట్ మహేశ్, ఎర్రమంజిల్ లోని రోడ్డు భవనాల శాఖలోని సీనియర్ అసిస్టెంట్ చిలివేరి శంతన్ కుమార్ లపై కేసులు నమోదు చేసినట్లు రోనాల్డ్ రాస్ పేర్కొన్నారు. ఎన్నికల శిక్షణ తరగతులకు గైర్హాజరైన వారికి ఈ నెల 20న మరోసారి శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. గైర్హాజరు అవుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని రోనాల్డ్ రాస్ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details