తెలంగాణ

telangana

ETV Bharat / state

సుప్రీంకోర్టును ఆశ్రయించిన గ్రూప్-1 అభ్యర్థులు - ఆ జీవో రద్దు కోరుతూ పిటిషన్

సుప్రీంకోర్టును ఆశ్రయించిన గ్రూప్-1 అభ్యర్థులు - జీవో 29 రద్దు చేయాలని పిటిషన్‌ వేసిన అభ్యర్థులు - జీవో 29 వల్ల కలిగే నష్టాన్ని సీజేఐకి వివరించిన పిటిషనర్‌ తరఫు న్యాయవాది

Group1 candidates At Supreme Court
Group1 candidates At Supreme Court (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 18, 2024, 3:22 PM IST

Updated : Oct 18, 2024, 4:04 PM IST

Group1 Candidates At Supreme Court :తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్​ 29ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ గ్రూప్‌-1 అభ్యర్థులు సుప్రీంకోర్టు తలుపుతట్టారు. అప్పటివరకు పరీక్షను వాయిదా వేయాలని కోరారు. జీవో 55నే అమలు చేయాలని కోరినప్పటికీ సీఎం పట్టించుకోవడం లేదని పిటిషన్‌లో గ్రూప్​-1 అభ్యర్థులు పేర్కొన్నారు. విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. జీవో 29 మా పాలిట శాపంగా మారిందని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు.

జీవో 29ను రద్దు చేయాలని కోరుతూ :దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 8న జారీ చేసిన జీవో 29ను రద్దు చేయాలని రాష్ట్రంలోని గ్రూప్‌-1 అభ్యర్థులు కోరుతున్నారు. జనరల్‌ కేటగిరీలోని క్యాండిడేట్స్​ కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిని అన్‌రిజర్వుడుగానే పరిగణిస్తుండటం వల్ల దివ్యాంగ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారికంటే ఎక్కువ మార్కులు వచ్చినా రిజర్వేషన్‌ కేటగిరీగానే పరిగణించి 1:50 కింద అభ్యర్థులను మెయిన్స్‌కు పిలవాలని వారు కోరుతున్నారు.

దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించిన వివాదం నేపథ్యంలో గ్రూప్‌-1 పరీక్షలు నిలిపివేయాలని కొందరు అభ్యర్థులు కోరగా అందుకు హైకోర్టు నిరాకరించింది. నోటిఫికేషన్‌ రద్దు చేయాలన్న అభ్యర్థనను తిరస్కరించిన ఉన్నత న్యాయస్థానం నియామకాలనేవి తుది తీర్పునకు లోబడి ఉంటాయని విచారణ వాయిదా వేసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా గ్రూప్‌ -1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Group1 Candidates Protest :గ్రూప్​-1 పరీక్షలను రద్దు చేయాలంటూ పలువురు అభ్యర్థులు గత రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. గురువారం హైదరాబాద్​ గాంధీనగర్​లోని పార్కుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన అభ్యర్థులు ఈ నెల 23నుంచి నిర్వహించే పరీక్షలను రద్దు చేయాలని కోరారు. గ్రూప్​-1పై ఉన్న కేసులన్నీ తొలగిన తర్వాతే మెయిన్స్​ పరీక్ష నిర్వహించకపోతే తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యర్థులు వాపోయారు. ఈ నేపథ్యంలోనే తాజాగా గ్రూప్​-1 అభ్యర్థులు తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

గ్రూప్‌-1 మెయిన్స్​కు దగ్గరపడుతోన్న సమయం - పరీక్షల రద్దుకు అభ్యర్థుల ఆందోళన

అశోక్ నగర్​లో పరిస్థితి ఆందోళనకరం - మళ్లీ రోడ్డెక్కిన గ్రూప్-1 అభ్యర్థులు

Last Updated : Oct 18, 2024, 4:04 PM IST

ABOUT THE AUTHOR

...view details