Fake RPF SI Malavika Arrested : రైల్వే పోలీసు కావాలన్నది ఆమె ఆకాంక్ష. అందుకోసం 2018లో జరిగిన ఆర్పీఫ్ ఎస్సై పరీక్షలను రాసింది. కంటి చూపు సరిగా లేకపోవడం ఆమె పాలిట శాపంగా మారింది. ఎలాగైనా తన గ్రామంలో పేరు తెచ్చుకోవాలని, పోలీసు ఆఫీసర్‌గా ప్రజల్లో చలామణి కావాలని నిశ్చయించుకుంది. ఇందుకోసం ఆర్పీఎఫ్ పోలీసులు ధరించే దుస్తులు కొనుగోలు చేసి, నకిలీ గుర్తింపు కార్డును తయారుచేసుకుని రైల్వే పోలీసు అవతారమెత్తింది.
తనకు రైల్వేలో ఎస్సైగా(Fake RPF SI) ఉద్యోగం వచ్చిందని తల్లి తండ్రులను, గ్రామస్థులను నమ్మించి ఏడాది పాటు శంకర్‌పల్లి రైల్వే స్టేషన్‌కు విధుల నిమిత్తం వెళ్లి వస్తున్నట్లు నటించింది. ఎక్కడికి వెళ్లినా యూనిఫాంలోనే వెళ్తూ, ప్రముఖులను కలిసి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టింది. ఇన్స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ అందరిలో గౌరవాన్ని, నమ్మకాన్ని చూరగొన్నప్పటికి పెళ్లి చూపులకి అదే యూనిఫాంలో వెళ్లి బుక్కయింది. పెళ్లి సంబంధం విషయమై యువకుడి తరఫువారు రైల్వే ఉన్నతాధికారులను సంప్రదించగా అసలు రంగు బయటపడి, సదరు యువతి కటకటాలపాలయ్యింది.
Fake RPF SI Arrested in Narketpally : నకిలీ రైల్వే ఎస్సై వివరాలను సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ సలీమా వివరించారు. నార్కట్‌పల్లికి చెందిన మాళవిక నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి అర్.పి.ఎఫ్ ఎస్సై పరీక్షలకు హాజరయ్యింది. ఆమెకు కంటి చూపు సరిగా లేక ఎస్సైగా అర్హత సాధించలేకపోయిందని.. ఎలాగైనా తన తల్లిదండ్రులు, గ్రామస్థుల ముందు పోలీస్‌గా చలామణి అవ్వాలనే ఉద్దేశంతో, నకలీ ఎస్సైగా అవతారమెత్తిందని ఎస్పీ తెలిపారు.
ఫేక్ లోన్ యాప్‌లను ఇలా గుర్తించండి! - ఆ వలలో పడిపోతే అంతే!