Pawan Kalyan Serious about Police Negligence During Road Accidents:రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హితవు పలికారు. పోలీసులు బాధ్యతగా పని చేయకపోతే వారు చేసిన తప్పులు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయని అన్నారు. ఇటీవల కాకినాడ జిల్లా తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, ఈ వ్యవహారంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుల తల్లిదండ్రుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఆ కుటుంబాలకు తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని అన్నారు.
శనివారం మంగళగిరిలోని వారి క్యాంపు కార్యాలయంలో ఇటీవల తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భీమవరం ప్రాంతానికి చెందిన పోలిశెట్టి రేవంత్ శ్రీమురహరి, విజయవాడకు చెందిన నాదెండ్ల నిరంజన్ల కుటుంబ సభ్యులకు పవన్ కల్యాణ్ ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు తన ట్రస్ట్ తరఫునుంచి 2 లక్షల ఆర్ధిక సాయం అందించారు. పోలీసులు వ్యవహించిన తీరుపై బాధిత కుటుంబసభ్యులకు పవన్ క్షమాపణలు చెప్పారు. కనీసం సమాధానం చెప్పకపోగా పోలీసులు మాట్లాడిన తీరు బాగాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై ఎందుకు కేసులు పెట్టలేదని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
వాలంటీర్ల విషయంలో సమస్యంతా అదే! - క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్