తెలంగాణ

telangana

ETV Bharat / state

గుట్టుచప్పుడు కాకుండా బ్యాంక్ వాహనాల్లో నగదు తరలింపు - ఒక్కరోజే రూ.కోటికి పైగా సొత్తు స్వాధీనం - 1 CRORE SEIZED IN HYD IN 1 DAY

Cyberabad Police Seized Huge Amount Of Money in Hyderabad : హైదరాబాద్​లో మంగళవారం రాత్రి పలుచోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీంతో భారీ స్థాయిలో నగదు పట్టుబడింది. మొత్తం రూ.కోటి ఆరు లక్షలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఎన్నికల నియమాలు పాటించకుండా తరలిస్తున్నట్లు గ్రహించి ఆ నగదును సీజ్​ చేసినట్లు వెల్లడించారు.

Police Seized Huge Amount in Hyderabad
1 Crore Rupee Seized by Police in Cyberabad

By ETV Bharat Telangana Team

Published : May 1, 2024, 10:16 AM IST

One Crore Seized in Hyderabad in One Day: రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల దృష్ట్యా ఓటర్లను మభ్యపెట్టేందుకు ఎలాంటి ఘటనలను జరగకుండా ఉండేందుకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. సుమారు రూ.1.06 కోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సంఘం నిర్ధేశించిన నియమాలు పాటించకుండా తరలిస్తున్నందున సీజ్​ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : హైదరాబాద్​లో ఎన్నికల కోడ్​ తనిఖీల్లో భాగంగా సైబరాబాద్​ కమిషనరేట్​లో ఎస్​ఓటీ బృందం, వాహనాలపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో బ్యాంకులకు నగదు తీసుకెళ్లే వాహనాల్లో డబ్బును తరలిస్తున్నట్లు గుర్తించారు. వాటిని తనిఖీ చేయగా రూ. 1,06,62,730లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు మొత్తం పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుకున్నారు. ఈ డబ్బును ఎన్నికల సంఘం నిర్ధేశించిన ఎలాంటి నియమాలు పాటించకుండా తరలిస్తున్నందుకు సీజ్​ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో పాటు నగదు పట్టుకున్న ప్రాంతాల వివరాలు కూడా తెలిపారు.

క్రమ సంఖ్య నగదు పట్టుకున్న బృందం పేరు స్థానిక పోలీస్ స్టేషన్ పేరు పట్టుకున్న నగదు(రూపాయల్లో)
1 మేడ్చల్ ఎస్​ఓటీ టీం దుండిగల్ 60,17,400
2 రాజేంద్రనగర్‌ ఎస్​ఓటీ టీం అత్తాపూర్ 22,30,600
3 మేడ్చల్ ఎస్​ఓటీ టీం శామీర్‌పేట 9,11,900
4 మాదాపూర్‌ ఎస్​ఓటీ టీం చందానగర్‌ 7,38,327
5 మేడ్చల్ ఎస్​ఓటీ టీం రాజేంద్రనగర్ 5,01,993
6 బాలానగర్‌ ఎస్​ఓటీ టీం కూకట్‌పల్లి 2,62,600
మొత్తం 1,06,62,730

వాహనాల తనిఖీల్లో రూ 5.73 కోట్ల విలువైన బంగారం పట్టివేత

Huge Amount Seized in Election Code : ఎన్నికల కోడ్​ అమల్లో ఉన్నప్పుడు రూ.50 వేలకు మించి అధికంగా డబ్బులు తీసుకొని వెళ్తే పోలీసులకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ నగదును ఏటీఎం ద్వారా తీస్తే రిసిప్ట్​ చూపించాల్సి ఉంటుంది. అదే మెడికల్​ ఎమర్జెన్సీ కోసమైతే రోగి వివరాలు, అపరేషన్​కు అయ్యే ఖర్చు తదితర విషయాలను చూపించాల్సి ఉంటుంది. సరైన ఆధారాలు లేనిచో పోలీసులు ఆ నగదును సీజ్​ చేస్తారు.

ఎన్నికల వేళ పోలీసుల సోదాలు - ఇప్పటివరకు రూ.104 కోట్ల నగదు సీజ్​ - HUGE AMOUNT OF CASH SEIZED IN TS

అమల్లోకి ఎన్నికల కోడ్ - నిఘా పెంచిన ఈసీ - ఎక్కడికక్కడ ముమ్మర తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details