CP Formed Commandos Against Cyber Crimes:నేరాలు జరిగిన తర్వాత దర్యాప్తు కంటే జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి రాజ శేఖర్ బాబు తెలిపారు. సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతూ ఉంటాయని అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సైబర్ నేరాలకు అడ్డుకట్ట వెయవచ్చని తెలిరారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తే ఆ నేరాల బారిన పడకుండా ఉంటారని అన్నారు. ఈ సైబర్ నేరాలను అంతం చేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతో సీపీ ఆధ్వర్యంలో పోలీస్ కమీషనరేట్ పరిదిలోని పోలీస్ సిబ్బందిని, మహిళా పోలీసులను సైబర్ కమాండోలుగా ఏర్పాటు చేశారు.
ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చేందుకు వినూత్న పద్దతిలో ముందుకు పోవడానికి ఈ సైబర్ కమాండోలను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఇప్పటికే కమీషనరేట్ పరిదిలో అన్ని కళాశాలలో విద్యార్ధులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించి వారిలో ఆసక్తి కలిగిన వారిని సైబర్ సోల్జర్స్‌గా నమోదు చేశారు. ప్రతి సైబర్ కమాండోకు 10-15 మంది సోల్జర్స్‌ను ఇవ్వడం జరుగుతుందని ఆ కమాండోలు సోల్జర్స్‌కు గైడ్ చేస్తూ వారు ఎక్కువ మంది ప్రజలను సైబర్ సిటిజన్లుగా మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని సీపీ సూచించారు.
17మంది గంజాయి స్మగ్లర్లు అరెస్ట్- ముఠాల కదలికలపై నిరంతర నిఘా : సీపీ - Cannabis smugglers arrested