ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నారావారిపల్లెలో సంక్రాంతి సందడి - పోటీల్లో పాల్గొన్న మహిళలకు కానుక - CM FAMILY SANKRANTI CELEBRATIONS

నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు - మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు - పిల్లలతో ఆడుకున్న దేవాన్ష్​

cm_chandrababu_family_at_naravaripalli_in_chittoor_district
cm_chandrababu_family_at_naravaripalli_in_chittoor_district (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 13, 2025, 1:40 PM IST

CM Chandrababu Family At Naravaripalli in Chittoor District :ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు కోలాహలంగా సాగుతున్నాయి. సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్​, ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్‌, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర సహా ఇతర కుటుంబసభ్యులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని సందడి చేశారు.

మహిళలకు ముగ్గుల పోటీలు, విద్యార్థులకు పలు ఆటల పోటీలను నిర్వహించారు. భువనేశ్వరి, బ్రాహ్మణి మహిళలు వేసిన ముగ్గులను వీక్షించారు. ముగ్గుల పోటీల్లో 126 మంది మహిళలు పాల్గొనగా వారందరికీ 10 వేల 116 రూపాయల చొప్పున నగదు బహుమతిని భువనేశ్వరి అందజేశారు.

సంక్రాంతి జరుపుకోని ఊరు ఉంది - మీకు తెలుసా !

అనంతరం సీఎం కుటుంబసభ్యులతో కలిసి ఆటల పోటీలను ఆసక్తిగా తిలకించారు. సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్‌ కూడా ఆటల పోటీల్లో పాల్గొని సందడి చేశాడు. వివిధ అంశాల్లో నిర్వహించిన ఆటల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు చంద్రబాబు స్వయంగా బహుమతులు అందజేశారు. విద్యార్థులు, గ్రామస్థులు చంద్రబాబతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.

పల్లెల్లో సందడి - ఘనంగా భోగి వేడుకలు

ABOUT THE AUTHOR

...view details