Charity Jumble Sale Exhibition in Telangana :హైదరాబాద్‌లోని సైనిక్‌పురి, వాయుపురికి చెందిన కొందరు మహిళలు ఓ బృందంగా ఏర్పడి "ఛారిటీ జంబుల్ సేల్" సంస్థ ద్వారా సేవాసంస్థలకు(Service Organizations) డబ్బులు సమకూర్చేందుకు పూనుకున్నారు. చాలామంది ఇళ్లలో వాడేసిన పాత వస్తువులను బయట పడేస్తుంటారు. అలాంటి వాటిని సేకరించి ఈ ఛారిటీ జంబుల్ సేల్‌లో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అలా వచ్చిన డబ్బులను తమ లక్ష్యం కోసం ఉపయోగిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఉత్సాహంగా 'రన్ ఫర్ గర్ల్ చైల్డ్' - జెండా ఊపి ప్రారంభించిన గవర్నర్ తమిళిసై
ఈ ఛారిటీ జంబుల్ సేల్‌లో చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి పుస్తకాలు, దుస్తులు, గృహోపయోకరణాలు లభిస్తున్నాయి. ఈ వస్తువులు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును అనాథ శరణాలయాలు(Orphanages), సేవాసంస్థలకు డొనేట్ చేస్తున్నారు. 2016 నుంచి ఏటా ఫిబ్రవరిలో ఓ రోజు ఈ ఛారిటీ జంబుల్ సేల్ దిగ్విజయంగా నడుస్తోంది. నగరవాసులు దీన్ని సందర్శించి అవసరమైన వస్తువులను కొనుక్కుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ తమ సంస్థను ముందుకు తీసుకెళ్లడం ఎంతో సంతోషంగా ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.
"అందరం కలిసి ఒక టీంవర్క్లా పనిచేస్తున్నాం. చాలామంది ఇక్కడ వస్త్రాలను కొనుగోలు చేస్తున్నారు. వీటి ద్వారా వచ్చిన డబ్బులను వృద్ధాశ్రమాలకు, అనాథ ఆశ్రమాలకు, బ్లైండ్ పీపుల్స్‌కు అందిస్తున్నాం. ఇది ఇలానే కొనసాగితే చాలా బాగుటుంది. మేము అన్ని ఇళ్ల నుంచి ఈ వస్తువులను సేకరించి, వాటికి మంచిగా తయారు చేసి ఒక నిర్దిష్ట ధరను కేటాయిస్తాం. ఇవన్నీ మాకు ఉచితంగానే లభిస్తాయి."-ఛారిటీ మెంబర్స్