వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ఫట్ - కూటమి సూపర్ సిక్స్ బ్లాక్ బస్టర్ హిట్: చంద్రబాబు CHANDRABABU ON YSRCP MANIFESTO: వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలన దోపిడీ మయమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. నెల్లూరు జిల్లా కోవూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, జగన్ ప్రకటించింది మేనిఫెస్టో కాదని రాజీనామా పత్రమని విమర్శించారు. ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించి జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పారిపోయాడని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
సూపర్ సిక్స్' హిట్:తెలుగుదేశం మేనిఫెస్టో 'సూపర్ సిక్స్' సూపర్ హిట్ అయితే, జగన్ ప్రవేశపెట్టిన వైఎస్సార్సీపీ మేనిఫెస్టో వెలవెల పోయిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైందని, ప్రజా స్పందన చూస్తుంటే సైకో జగన్ మే 13 తర్వాత ఇంటికి పోవడం ఖాయమని చంద్రబాబు అన్నారు. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో కొత్త అంశాలు ఏమీ లేవని, ఉద్యోగాల గురించి ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు.
జగన్ అహంకారి - విధ్వంసం, వినాశనమే తప్ప అభివృద్ధి చేతకాదు : చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING
బటన్ నొక్కి పది రూపాయలిచ్చి వెయ్యి రూపాయలు దోచేశారని దుయ్యబట్టారు. ఒక్క అభివృద్ధి పని చెయ్యకుండా 13 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారని విమర్శించారు. పేదరికం లేని సమాజం చూడటమే తన జీవితాశయమని చంద్రబాబు వెల్లడించారు. తెలుగుదేశం అధికారం చేపడితే ఉద్యోగులు, ఉపాధ్యాయులతోపాటు అంగన్వాడీలు, ఆటో కార్మికులు, చేనేత కార్మికులకు సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించారు.
అంగన్వాడీ కార్యకర్తలు, హోంగార్డులకు జీతాలు పెంచుతాం: యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఐదేళ్లుగా వారి భవిష్యత్‌తో జగన్ ఆడుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులను బానిసలుగా చూస్తూ, వారి పొదుపును వాడుకున్నారని మండిపడ్డారు. మద్యం దుకాణాల వద్ద టీచర్లను కాపలాపెట్టారని ఆక్షేపించారు. తాము అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలు, హోంగార్డులకు జీతాలు పెంచుతామని స్పష్టం చేశారు.
కురుక్షేత్ర యుద్ధంలో ధర్మానిదే విజయం - వైసీపీను చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యం: చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING
హత్యా రాజకీయాల్లో జగన్ మంచి ఎక్స్‌పర్ట్ అని చంద్రబాబు విమర్శించారు. పింఛనుదారుల మరణాలకు జగనే కారణమని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాతో పాటు నియోజకవర్గాల అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉందన్న ఆయన, అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
కోవూరు నియోజకవర్గ అభ్యర్థి ప్రసన్న కుమార్‌పై తీవ్ర స్థాయిలో చంద్రబాబు మండిపడ్డారు. అవినీతి, అక్రమాలకు అడ్డాగా నియోజకవర్గాన్ని మార్చుకున్నారని, మహిళ అని కూడా చూడకుండా ప్రశాంతిరెడ్డిపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక అరాచక పాలన పురుడుపోసుకుందని విమర్శించారు.
సీఎం పదవి నాకు బాధ్యత- జగన్‌కు వ్యాపారం: చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING
అదే ఇప్పుడు శాపంగా మారింది: పాపం అని ఓట్లు వేస్తే, అదే ఇప్పుడు ప్రజలకు శాపంగా మారిందని ధ్వజమెత్తారు. దోచుకోవడం, దాచుకోవడం అన్నచందంగా వైఎస్సార్సీపీ పాలన సాగిందన్న చంద్రబాబు, వైఎస్సార్సీపీని చిత్తుచిత్తుగా ఓడించి ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని తెలుగుదేశం అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి, విజయసాయి మాత్రం దోపిడీ కోసం వచ్చారని విమర్శించారు.
Chandrababu Naidu Today Schedule:నేడు నెల్లూరు, ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. నెల్లూరులో ఉదయం ముస్లిం మైనార్టీలతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో ప్రజాగళం రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొంటారు. రాత్రికి కోడుమూరు నియోజకవర్గంలో బస చేస్తారు.
జూన్ 4న అమరావతి రక్షణ - జగనాసుర వధ : చంద్రబాబు - Chandrababu Election Campaign