తెలంగాణ

telangana

ETV Bharat / state

బీజేపీ విజయ సంకల్ప యాత్రలకు అంతా సిద్ధం - ముగింపు సభకు ప్రధాని రాక!

BJP Focus on High Parliament Seats : పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం పది స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా కాషాయ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఈనెల 20వ తేదీ నుంచి విజయసంకల్ప యాత్ర పేరిట రథయాత్రలు చేపడుతోంది. 17 పార్లమెంట్ స్థానాలను కమల దళం 5 క్లస్టర్లుగా విభజించుకుంది. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలు, 119 అసెంబ్లీ స్థానాలు చుట్టేయాలని ప్లాన్ చేసుకుంది. ఐదు క్లస్టర్లలో భాగంగా మొత్తం 4,238 కిలోమీటర్ల మేర ఈ రథయాత్రలు సాగనున్నాయి. యాత్రల ముగింపు సభకు ప్రధాని మోదీ రాబోతున్నట్లు తెలుస్తోంది.

BJP Target on 17 Lok Sabha Seats in Telangana
BJP Focus on High Parliament Seats

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2024, 4:55 PM IST

BJP Focus on High Parliament Seats :విజయ సంకల్ప యాత్రలు ఈనెల 20 నుంచి 29వరకు నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సిద్ధమైంది. ఐదు క్లస్టర్స్​లో రెండు పెద్దగా ఉండటంతో అనుకున్న సమయానికి పూర్తి కాకపోవచ్చని భావిస్తోంది. ఈ రెండు క్లస్టర్స్​లో మార్చి 3వ తేదీ వరకు యాత్రలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని యాత్రలు చివరకు హైదరాబాద్​కు చేరుకునేలా రూట్ మ్యాప్​ను(Route Map) రాష్ట్ర నాయకత్వం సిద్ధం చేసింది.

టార్గెట్ 17 ఎంపీ స్థానాలు - ఈనెల 20 నుంచి బస్సు యాత్రలు : కిషన్‌రెడ్డి

అనివార్య కారణాల వల్ల అన్ని యాత్రలు ఒకే రోజు ముగింపు కుదరకుంటే, బహిరంగ సభను 4వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తోంది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాష్ట్ర నాయకత్వం ఆహ్వానించింది. ప్రధాని రాకపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విజయసంకల్ప యాత్రలో ఎక్కువ శాతం రోడ్డు షోలు ఉండనున్నాయి.

PM Modi Attend Telangana BJP Yatra :ఈ యాత్రను హైదరాబాద్​లో ముగించాలని భావిస్తున్న నేపథ్యంలో సభ ఎక్కడ నిర్వహిస్తే బాగుంటుందనే అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది. పరేడ్ గ్రౌండ్ వేదికగా అయితే బాగుంటుందనే ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ విజయ సంకల్ప యాత్రతో పార్లమెంట్ ఎన్నికలకు కాషాయ పార్టీ సమాయత్తం కానుంది. మోదీ(PM Modi) వస్తారని ప్రచారం జరగడంతో ప్రాధాన్యత ఏర్పడింది. రథయాత్రల ముగింపు సభతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు సైతం ప్రధాని ఈ సభతో సమరశంఖం పూరించనున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 16లోపు బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన - ఫస్ట్​ లిస్ట్​లో ఛాన్స్​ వీరికే!

రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలను 5 క్టస్లర్లుగా బీజేపీ విభజించింది. ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లను కలిపి ఒక క్లస్టర్​గా విభజించగా దీనికి ‘కొమురం భీమ్ యాత్ర’గా నామకరణం చేసింది. 800 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ పార్లమెంట్లను ఒక క్లస్టర్​గా విభజించింది. దీనికి ‘కృష్ణమ్మ యాత్ర’గా పార్టీ నామకరణం చేసింది. ఇక్కడ 926 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టనున్నారు. కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల పార్లమెంట్​ను ఒక క్లస్టర్​గా విభజించగా, దీనికి ‘శాతవాహన యాత్ర’గా పేర్కొంది.

BJP Target on 17 Lok Sabha Seats in Telangana : 1012 కిలోమీటర్ల మేర ఈ క్లస్టర్​లో యాత్ర(BJP Bus Yatra) కొనసాగనుంది. ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్​ను మరో క్లస్టర్​గా విభజించారు. దీనికి ‘కాకతీయ యాత్ర’గా పేరు పెట్టారు. ఇందులో 1000 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టనున్నారు. ఇకపోతే భువనగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్ గిరిని ఒక క్లస్టర్​గా, ఇందులో చేపట్టే యాత్రను ‘భాగ్యనగర్ యాత్ర’గా నిర్ణయించారు. 500 కిలోమీటర్ల మేర యాత్ర జరగనుంది. ఒక్కో యాత్రలో ప్రతి రోజూ రెండు లేదా మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేస్తారు. ప్రతి యాత్రలో ముఖ్య నాయకులు పాల్గొంటారు.

Telangana Parliament Seats : తెలంగాణ వ్యాప్తంగా కొనసాగే ఐదు యాత్రల్లో రాష్ట్రస్థాయి నేతలు ఒక్కోచోట రెండ్రోజులు పాల్గొనే అవకాశముంది. కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నేతలు సైతం వచ్చే అవకాశముంది. రథయాత్రలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈనెలాఖరున ఏదైనా ఒక యాత్రలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Home Minister Amit Shah) పాల్గొనే అవకాశముందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. గతంలో షా మహబూబ్ నగర్, కరీంనగర్ పార్లమెంట్ల పరిధిలో నిర్వహించిన సభకు రావాల్సి ఉండగా, బిహార్ రాజకీయ సంక్షోభం కారణంగా వాయిదా పడింది. ఈనేపథ్యంలో ఈనెలాఖరున ఏదో ఒకరోజు అమిత్ షా వచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో రచించాల్సిన వ్యూహాలపై నాయకులకు దిశానిర్దేశం చేసే అవకాశముందని సమాచారం.

17 ఎంపీ సీట్లే లక్ష్యం - లోక్‌సభ ఎన్నికల కోసం 35కు పైగా బీజేపీ కమిటీలు

రాష్ట్రానికి వచ్చిన కేంద్ర నిధులను వివరించడానికే జనహిత యాత్ర: బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details