తెలంగాణ

telangana

By ETV Bharat Sports Team

Published : Sep 26, 2024, 6:37 AM IST

ETV Bharat / sports

మెగా వేలంలోకి 5 స్టార్‌ ప్లేయర్స్!​ - ఏ ఫ్రాంఛైజీ ఎవరిని వదులుకుంటుందంటే? - IPL 2025 Mega Auction

IPL 2025 Mega Auction : ఐపీఎల్‌ 2025 మెగా వేలానికి సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. కొందరు స్టార్‌ ప్లేయర్లను ఫ్రాంఛైజీలు వదులు కోవడానికి సిద్ధపడినట్లు సమాచారం. పూర్తి వివరాలు స్టోరీలో.

source ANI
IPL 2025 Mega Auction (source ANI)

IPL 2025 Mega Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌ మొదలుకావడానికి చాలా సమయం ఉంది. కానీ అప్పుడే ఐపీఎల్‌ విశ్లేషణలు, వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఐపీఎల్‌ 2025 మెగా వేలం. నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ ప్రారంభంలో మెగా వేలం నిర్వహించే అవకాశం ఉంది. ఐపీఎల్‌ 2025 వేలానికి సంబంధించి బీసీసీఐ ఇంకా ఫ్రాంఛైజీల రిటెన్షన్‌, రిలీజ్‌ గైడ్‌లైన్స్‌ను ప్రకటించాల్సి ఉంది. అయితే ఏ ఫ్రాంచైజీ ఏ స్టార్‌ ప్లేయర్‌ను వదులుకుంటుంది అనే అంశంపై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఐపీఎల్‌ 2025లో మెగా వేలంలో భాగమయ్యే అవకాశం ఉన్న స్టార్‌ క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

  • కేఎల్ రాహుల్ (లఖ్‌నవూ సూపర్ జెయింట్స్)

కేఎల్‌ రాహుల్‌ కూడా వేలంలో పాల్గొంటాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. రాహుల్ వచ్చే సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)లో చేరవచ్చని ఊహాగానాలు ఉన్నాయి.

  • ఫాఫ్ డు ప్లెసిస్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

ప్రస్తుతం ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్న డు ప్లెసిస్‌ను ఆర్సీబీ వదులుకుంటుందని, కొత్త కెప్టెన్‌ కోసం ప్రయత్నిస్తుందని సమాచారం. ప్రస్తుతం డు ప్లెసిస్‌ వయసు దాదాపు 40 ఏళ్లు. కెప్టెన్సీ, బ్యాటింగ్‌ పరంగా ఏ సమస్యలు లేనప్పటికీ ఆర్సీబీ ఓ యంగ్‌ కెప్టెన్‌ను నియమించుకునే ఆలోచనలో ఉంది.

  • రోహిత్ శర్మ (ముంబయి ఇండియన్స్)

ముంబయి ఇండియన్స్‌కు ఐదు ఐపీఎల్ టైటిల్స్ అందించిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీ రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో ఉంది. 2024 ఐపీఎల్‌కు ముందు రోహిత్‌ స్థానంలో హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌ అయిన సంగతి తెలిసిందే. పాండ్యానే ఎంఐ కెప్టెన్‌గా కొనసాగుతాడని సమాచారం. దీంతో రోహిత్ మరో ఫ్రాంఛైజీ మారవచ్చు.

  • గ్లెన్ మాక్స్‌వెల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

స్టాట్‌ టీ20 బ్యాటర్‌ మాక్స్‌వెల్‌ ఐపీఎల్ 2024లో దారుణంగా విఫలమయ్యాడు. స్థాయికి తగినట్లు పెర్ఫార్మ్‌ చేయలేదు. అభిమానలను తీవ్రంగా నిరాశపరిచాడు మాక్స్‌వెల్‌ను కూడా ఆర్సీబీ IPL 2025 మెగా వేలానికి ముందు రిలీజ్‌ చేసే అవకాశం ఉంది.

  • వెంకటేష్ అయ్యర్ (కోల్‌కతా నైట్ రైడర్స్)

వెంకటేష్ అయ్యర్ గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున అద్భుతంగా ఆడాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో కీలక ప్రదర్శనలు చేశాడు. అయితే కేకేఆర్‌ వేలానికి ముందు వెంకటేష్‌ కన్నా ఇతర ప్లేయర్‌లను ఉంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు.
నో RTM కార్డ్- 5గురు ప్లేయర్ల రిటెన్షన్- మెగా వేలం కొత్త రూల్స్ ఇవే! - IPL 2025 Auction Rules

498 పరుగులతో విధ్వంసం - 86 ఫోర్లు, 7 సిక్సర్లు- యువక్రికెటర్ ధనాధన్ ఇన్నింగ్స్ - 498 Runs In An Innings

ABOUT THE AUTHOR

...view details