Ind vs Aus 1st 2024 :బోర్డర్ గావస్కర్ ట్రోఫీ భారత్- ఆస్ట్రేలియా తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసేసరికి టీమ్ఇండియా 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్ స్కోర్ 172-0. క్రీజులో యశస్వీ జైస్వాల్ (90 పరుగులు ; 193 బంతుల్లో 7x4, 2x6), కేఎల్ రాహుల్ (62 పరుగులు; 153 బంతుల్లో ; 4 x4) ఉన్నారు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసి, సెంచరీ వైపు దూసుకెళ్తున్నారు.
రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారు. ప్రత్యర్థుల బౌలింగ్ ఎటాక్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. తర్వాత క్రీజులో పాతుకుపోయి క్రమంగా దూకుడు పెంచారు. టీ బ్రేక్ సమయానికి భారత్ 84/0తో నిలిచింది. ఆఖరి సెషన్‌లో పిచ్ బౌలర్లకు సహకరించడం వల్ల బ్యాటర్లు ఆచితూచి ఆడారు. ఈ క్రమంలోనే జైస్వాల్ 123 బంతుల్లో, రాహుల్ 124 బంతుల్లో అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ 67- 7 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ 104 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లోనే 46 పరుగుల ఆధిక్యం దక్కింది. మిచెల్ స్టార్క్ (26 పరుగులు; 112 బంతుల్లో 2x4) టాప్ స్కోరర్. టీమ్ఇండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5, హర్షిత్ రాణా 3, మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు.