ICC Champions Trophy 2025 :వచ్చే ఏడాది జరగనున్నఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వేళ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే అవకాశాలు దాదాపు కష్టమేనని పేర్కొన్నాడు.
"ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే అవకాశాలు దాదాపుగా లేనట్లే అని అనిపిస్తోంది. నేను కూడా అసలు జరగకూడదనే కోరుకుంటున్నాను. వారు (ఐసీసీ) రిజెక్ట్ చేసే ముందే మీరు (పీసీబీ) వద్దని చెప్పాల్సింది. పీసీబీ, ఏసీబీ, ఐసీసీ ఏదైనా సరే బీసీసీఐతో అస్సలు పోరాడలేవు. ఎందుకంటే భారత్ బాయ్‌కాట్ చేస్తుందేమోననే భయం మమ్మల్ని వెంటాడుతోంది. అప్పుడు మనం ఏం చేయాలి? మన స్టాండ్ ఎలా ఉండాలి? ఐసీసీ లేదా ఏసీబీ కలిసి వస్తాయా? అనేది మనం ఆలోచించుకోవాలి" అని లతీఫ్ వ్యాఖ్యానించాడు.
వచ్చే ఏడాది పాక్ ఆతిథ్యంలో ట్రోఫీ జరగాల్సి ఉంది. అయితే పీసీబీ, బీసీసీఐ మధ్య సయోధ్య కుదరడం లేదని క్రిటిక్స్ వాదన. ఈ క్రమంలోనే ఇప్పడు హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించాలంటూ ఐసీసీ కూడా పీసీబీకి ఆఫర్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ రీసెంట్గా జరగాల్సిన ఐసీసీ సమావేశం మాత్రం వాయిదా పడుతూనే వస్తోంది. అయితే ఈ విషయంపై తుది నిర్ణయాన్ని బుధవారం ఖరారు చేస్తారని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.