తెలంగాణ

telangana

ETV Bharat / sports

2025 ఛాంపియన్స్ ట్రోఫీ- దిగివచ్చిన పీసీబీ- హైబ్రిడ్ మోడల్​కు ఓకే!

2025 ఛాంపియన్స్ ట్రోఫీ- దిగివచ్చిన పీసీబీ- హైబ్రిడ్ మోడల్​కు ఓకే

2025 Champions Trophy India
2025 Champions Trophy India (Source: AP (Left), Getty Images (Right))

By ETV Bharat Sports Team

Published : Nov 8, 2024, 6:59 AM IST

2025 Champions Trophy India: 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణ విధానంపై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. టోర్నమెంట్​లో భారత్ ఆడే మ్యాచ్​లకు హైబ్రిడ్ మోడల్​ విధానాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంగీకరించినట్లు సమాచారం. పాకిస్థాన్‌ ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీలో టీమ్ఇండియా ఆడే మ్యాచ్​లకు సంబంధించి సర్దుబాట్లు చేసుకోవడానికి ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) సిద్ధంగా ఉందట.

దీంతో టీమ్ఇండియా తమ అన్ని మ్యాచ్​లు దుబాయ్​లో ఆడేలా షెడ్యూల్​లో మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. ఈ మేరకు పాకిస్థాన్ బోర్డు కూడా ఓకే చెప్పిందని సమాచారం. 'టీమ్ఇండియా పాకిస్థాన్‌లో పర్యటించడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే షెడ్యూల్​లో కొన్ని మార్పులు చేయాలని పీసీబీ ఆలోచిస్తోంది. టీమ్ఇండియా తమ మ్యాచ్‌లను దుబాయ్‌ లేదా షార్జాలో ఆడే అవకాశముంది' అని ఓ పీసీబీ అధికారి ఒకరు చెప్పారు.

కాగా, ఇన్నిరోజులు భారత్ మ్యాచ్​లపై స్పష్టత రాకపోవడం వల్ల ఐసీసీ తుది షెడ్యూల్ ఖరారు చేయలేదు. తాజాగా టీమ్ఇండియా మ్యాచ్​లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉండడం వల్ల ఫైనల్​ షెడ్యూల్ నవంబర్ 11న వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలో ఈ టోర్నీ జరగనుంది. హైబ్రిడ్ మోడల్​ ఫైనలైజ్ అయినట్లైతే, భారత్ మ్యాచ్​లు మినహా మిగతా టోర్నీ అంతా పాక్​లోనే జరుగుతుంది.

గతంలో ఇలానే
ఇరు దేశాల మధ్య ఉన్న పలు కారణాల వల్ల టీమ్ఇండియా కొన్నేళ్లుగా పాకిస్థాన్​లో పర్యటించడం లేదు. ఈ రెండు మధ్య ద్వైపాక్షిక సిరీస్​లు కూడా రద్దయ్యాయి. భారత్ - పాకిస్థాన్ ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే పోటీ పడుతున్నాయి. ఇక గతేడాది ఆసియా కప్ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్య దేశంగా వ్యవహరించింది. అయితే భద్రత కారణాల దృశ్య పాకిస్థాన్ వెళ్లేందుకు టీమ్ఇండియా నిరాకరించింది. ఎన్నో చర్చల తర్వాచ ఆసియా క్రికెట్ కౌన్సిల్ హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదించింది. దీంతో ఆ టోర్నీలో భారత్ మ్యాచ్​లన్నీ శ్రీలంకకు షిఫ్ట్ అయ్యాయి. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలోనూ ఇలాగే జరిగే ఛాన్స్​లు ఎక్కువగా ఉన్నాయి.

భారత్ ఫ్యాన్స్​కు PCB భారీ ఆఫర్! - 'క్రీడాభిమానులను పాక్ రప్పించేందుకే ఈ నిర్ణయం'!

ప్లీజ్​, టీమ్‌ఇండియా మా దేశానికి రావాలి! : పాక్ కొత్త కెప్టెన్​

ABOUT THE AUTHOR

...view details