తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2024, 3:28 AM IST

ETV Bharat / spiritual

ఆ రాశి వారికి నేడు అన్ని విషయాల్లో సంతోషమే! సూర్య ఆరాధన శ్రేయస్కరం!! - Daily Horoscope In Telugu

Horoscope Today 26th September 2024 : 2024 సెప్టెంబర్ 26వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

Horoscope Today 26th September 2024 : 2024 సెప్టెంబర్ 26వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా పూర్తి ఉత్సాహంగా, ఆనందంగా ఉంటారు. అన్ని రంగాల వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి కావడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సంపదలు కలిసి రావడంతో కుటుంబ వాతావరణం కూడా ఆనందభరితంగా ఉంటుంది. స్నేహితులు, ప్రియమైన వారిని కలుసుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోవడంతో ప్రశాంతంగా ఉంటారు. స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు. నూతన ఆర్ధిక వనరుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. మీ శ్రమకు తగిన ఫలితం లేక నిరాశకు గురవుతారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. స్నేహితుల ద్వారా ఆర్ధికంగా లబ్ది పొందుతారు. ఆర్ధికంగా ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలం. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ ఆశావహ దృక్పధంతో పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకుంటారు. ఇంటా బయటా సానుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యక్తిగత, వృత్తి సంబంధిత వ్యవహారాల గురించి ఈ రోజు ముఖ్యులతో చర్చిస్తారు. అందరి సహకారంతో కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగులకు అధిక పనిభారం కారణంగా అలసట ఉండవచ్చు. మిత్రుల సహకారంతో పనిభారం తగ్గుతుంది. ఇంటి అలంకరణ కోసం ధనవ్యయం చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ శక్తి, సామర్ధ్యాలను తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఏదైనా సాధించగల మీ ప్రతిభను పూర్తిగా వినియోగించుకుంటే పెద్ద పెద్ద డీల్స్ ను ఈ రోజు సునాయాసంగా సాధిస్తారు. వ్యాపారాలో అనుకూలత, పురోగతి ఉంటుంది. ఆర్ధికంగా మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేస్తారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కుటుంబంతో మీ బంధం దృఢపడుతుంది. బంధు మిత్రుల సహకారంతో ఒక ముఖ్యమైన వ్యవహారంలో విజయం సాధిస్తారు. స్నేహితులు, బంధువులను కలిసి పరస్పర శుభాకాంక్షలు తెలుపుకుంటారు. వృత్తి నిపుణులు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఎన్నడూ లేనంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడటంతో ఆందోళనల సుడిగుండంలో చిక్కుకున్నట్లుగా అనిపిస్తుంది. సంతానంతో ఏర్పడిన విబేధాలు తీవ్రంగా బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కూడా పరిస్థితి అంత అనుకూలంగా ఉండదు. మీ సీనియర్లు మీ పనితీరు పట్ల అసంతృప్తితో ఉంటారు. వ్యాపారంలో తీవ్ర నష్టాల కారణంగా మానసిక క్షోభకు గురవుతారు. శని స్తోత్రాలు పఠించడం వలన ప్రతికూలతలు తొలగిపోతాయి.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. కుటుంబ సమస్యలు, పనిలో ఒత్తిళ్లు కారణంగా అశాంతి, చికాకుతో ఉంటారు. దైవబలం ఒక్కటే మిమ్మల్ని ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షించగలదు. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే కలహాలు తప్పవు. ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం వలన ప్రశాంతత లభిస్తుంది.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ అభిరుచికి తగిన పని చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. చెప్పే మాటలకూ, చేసే పనులకు మధ్య సమతుల్యత పాటించడం అవసరం. వృత్తి పరంగా నైపుణ్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సమీప బంధువులలో కొందరి ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రక్తసంబంధం విలువ ఏమిటో గుర్తిస్తారు. అన్నదమ్ముల మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల మద్దతుతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారంలో పట్టిందల్లా బంగారం కావడంతో మంచి లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. కొత్త పనులు, ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉత్సాహం చూపిస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారులు నుంచి అందుకున్న ప్రసంశలు, ప్రోత్సాహం మరింత కష్టించి పనిచేసేలా చేస్తాయి. అందరి దృష్టిని ఆకట్టుకుంటారు. ముఖ్యమైన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. సమయానుకూలంగా వ్యవహరిస్తే మంచిది. కుటుంబ సమస్యల పట్ల ఆచి తూచి వ్యవహరించాలి. సహనంతో ఉంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. శ్రీలక్ష్మీదేవి ధ్యానం శుభప్రదం.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనవసర ఆందోళనలు మీ పనిని మరింత ఆలస్యం చేస్తాయి. నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యాన్ని తగ్గిస్తాయి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. భూమి లేదా ఆస్తికి సంబంధించిన చర్చలు వాయిదా వేస్తే మంచిది. మీ వ్యక్తిత్వానికి, కుటుంబానికి చెడ్డ పేరు తీసుకువచ్చే పరిస్థితులకు దూరంగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. హనుమాన్ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details