Phalguna Masam 2025 Festival List : తెలుగు పంచాంగం ప్రకారం ఫాల్గుణ మాసం తెలుగు మాసాలలో చివరిది. ఈ మాసంలో హోలీ, శ్రీలక్ష్మి జయంతి వంటి పండుగలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఫాల్గుణ మాసంలో రానున్న పర్వదినాలు, పుణ్య తిథుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
మాఘమాసం పూర్తయిన వెంటనే వచ్చే ఫాల్గుణ మాసం వేసవికి ఆరంభంగా చెబుతారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 29 వరకు ఉంటుంది
- ఫిబ్రవరి 28 వ తేదీ శుక్రవారం ఫాల్గుణ శుద్ధ పాడ్యమి:తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు సమాప్తం
- మార్చి 1 వ తేదీ శనివారం ఫాల్గుణ శుద్ధ విదియ:చంద్రోదయం
- మార్చి 6 వ తేదీ గురువారం ఫాల్గుణ శుద్ధ సప్తమి: తరిగొండ శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి బ్రహోత్సవాలు ప్రారంభం
- మార్చి 10 వ తేదీ సోమవారం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి: అమలక ఏకాదశి
- మార్చి 11 వ తేదీ మంగళవారం ఫాల్గుణ శుద్ధ ద్వాదశి:నృసింహ ద్వాదశి
- మార్చి 12 వ తేదీ బుధవారం ఫాల్గుణ శుద్ధ త్రయోదశి:పక్ష ప్రదోషం
- మార్చి 14 వ తేదీ శుక్రవారం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి:హోళికా పున్నమి, హోలీ పండుగ, కాముని పున్నమి, శ్రీలక్ష్మి జయంతి, కుమారధార తీర్ధ ముక్కోటి, మీన సంక్రమణం.
- మార్చి 17 వ తేదీ సోమవారం ఫాల్గుణ బహుళ తదియ/చవితి : సంకష్టహరచవితి
- మార్చి 18 వ తేదీ మంగళవారం ఫాల్గుణ బహుళ చవితి : శుక్రమౌడ్యారంభం
- మార్చి 25 వ తేదీ మంగళవారం ఫాల్గుణ బహుళ ఏకాదశి: సర్వేషాం పాపవిమోచన ఏకాదశి, శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి సన్నిధిన పుష్పయాగం
- మార్చి 26 వ తేదీ బుధవారం ఫాల్గుణ బహుళ ద్వాదశి:అన్నమాచార్య వర్ధంతి
- మార్చి 27 వ తేదీ గురువారం ఫాల్గుణ బహుళ త్రయోదశి: తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
- మార్చి 28 వ తేదీ శుక్రవారం ఫాల్గుణ బహుళ చతుర్దశి: మాసశివరాత్రి, శుక్రమౌడ్య త్యాగం
- మార్చి 29 వ తేదీ శనివారం ఫాల్గుణ అమావాస్య: సర్వ అమావాస్య . ఫాల్గుణ మాసం ముగింపు.