Political Parties Speed up Lok Sabha Election Campaign :నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చామలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మునుగోడు ఎమ్మెల్యే రాజ్‌గోపాల్‌రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి డిచ్‌పల్లిలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. తనను గెలిపిస్తే మంచిప్ప ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు.
BRS Election Campaign :దుబ్బాక నియోజకవర్గం అక్బర్‌పేటలో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మెదక్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మెదక్ జిల్లా చిన్న శంకారంపేటలో వెంకట్రామిరెడ్డి మద్దతుగా హరీశ్‌రావు రోడ్ షో నిర్వహించారు. రుణమాఫీ అమలుపై అమరవీరుల స్తూపం వద్దకు రమ్మంటే సీఎం రేవంత్‌రెడ్డి తోకముడిచారని ఆరోపించారు.
"కాంగ్రెస్ పార్టీ వచ్చిన నాలుగు నెలల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ప్రజలకు నేను గెలిచిన వెంటనే మంచిప్ప ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా. తెలంగాణలో కాంగ్రెస్ 14 స్థానాలు గెలుస్తుంది." -జీవన్‌రెడ్డి, నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి
రాష్ట్రంలో రాజకీయ వే"ఢీ"- ఫుల్ స్వింగ్‌లో ఎన్నికల ప్రచారం - lok sabha elections 2024
సూర్యాపేట జిల్లా నడిగూడెం, మోతె మండలాల్లో నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ రైతు పొలాల్లోకి నీళ్లు తెస్తే కాంగ్రెస్ కర్షకులకు కన్నీళ్లు తెప్పిస్తోందని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి రోడ్ షో నిర్వహించిన కేటీఆర్ బీఆర్ఎస్కు 12 మంది ఎంపీలను ఇస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతామని అన్నారు.