తెలంగాణ

telangana

ETV Bharat / politics

పల్నాడు టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు - వైసీపీ పనేనన్న నేతలు - Fire attack on tdp office

TDP office Set on Fire by Unknown Persons in Palnadu District : పల్నాడు జిల్లాలోని క్రోసూరులో తెలుగుదేశం కార్యాలయానికి ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా తాటాకులతో చలువ పందిరి ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి గుర్తుతెలియని ఆగంతకులు పందిరికి నిప్పంటించడంతో క్షణాల్లో దగ్ధమైంది. విషయం తెలుసుకున్న తెలుగుదేశం, జనసేన నాయకులు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.

TDP office Set on Fire
TDP office Set on Fire by Unknown Persons in Palnadu District

By ETV Bharat Telangana Team

Published : Apr 8, 2024, 11:41 AM IST

పల్నాడు టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు వైసీపీ పనేనన్న నేతలు

TDP office Set on Fire by Unknown Persons in Palnadu District :పల్నాడు జిల్లాలోని క్రోసూరులో తెలుగుదేశం కార్యాలయానికి ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పదిరోజుల కిందట కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌ మన్నెం భూషయ్య కాంప్లెక్స్‌లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా తాటాకులతో చలువ పందిరి ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి గుర్తుతెలియని ఆగంతకులు పందిరికి నిప్పంటించారు. ఎన్నికల సమయంలో సమావేశాలు వీలుగా ఉంటుందన్న ఆలోచనతో ఆయన అక్కడ కార్యలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే ఆయన ప్రచారం మొదలగు విషయాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నారు.

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు నోటీసులు - చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల ఫలితం - AP CEO Notices To CM YS Jagan

ఓర్వలేక నిప్పు పెట్టారు : అగ్ని ప్రమాదం విషయం తెలిసిన వెంటనే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రజా గళం జరిగిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది. క్రోసూరులో ప్రజాగళం సభ విజయవంతం కావడంతో, ఓర్వలేక నిప్పు పెట్టారని టీడీపీ శ్రేణులు ఆరోపించారు. ఇది వైసీపీ నాయకుల పనేనని టీడీపీ శ్రేణులు ఆందోళనకు చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలియజేశారు.

సమీపంలోనే అగ్నిమాపక కేంద్రం ఉన్నా, మంటలార్పడానికి ఆలస్యంగా వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిమాపక యంత్రాన్ని వైసీపీ నేతలే అడ్డుకున్నారని ఆరోపించారు. తెలుగుదేశం కార్యకర్తలు ఆవేశంతో ఊగిపోతూ, సమీపంలోని వైసీపీ కార్యాలయం వైపు పరుగులు తీశారు. పరిస్థితి అదుపుతప్పుతుందని గ్రహించిన పోలీసులు టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు. ఘటనపై విచారణ చేపడతామని, ప్రమాదానికి కారకులైన వారని పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. పోలీసుల హామీతో టీడీపీ శ్రేణులు శాంతించారు.
తన వాహనాన్ని పదే పదే తనిఖీ చేయడంపై లోకేశ్ అసహనం - అధికారుల తీరుపై అచ్చెన్న ఆగ్రహం - POLICE INSPECTED LOKESH CONVOY

'వైసీపీ శ్రేణులు మా కార్యాలయానికి నిప్పు అంటించారు. మెున్న జరిగిన చంద్రబాబు ప్రజాగళం సభ విజయవంతం కావడంతో, తట్టుకోలేక మా కార్యాలయాన్ని తగలబెట్టారు. ఓటమి భయంతోనే మా పార్టీ కార్యలయం తగలబెట్టారు. మేం తలుచుకుంటే వాళ్ల పరిస్థితి మరోలా ఉంటుంది. విజయం కోసం వైసీపీ నేతలు తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలో చోటు చేసుకుంటే సహించబోం. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. పోలీసు అధికారులు ఘటనపై విచారణ చేపట్టాలి. కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి.' - భాష్యం ప్రవీణ్, కూటమి అభ్యర్థి

'స్టేషన్‌కు వస్తావా ? రావా ? కాల్చి పడేస్తా' - టీడీపీ నేతకు కారంపూడి సీఐ బెదిరింపు - Karempudi CI Warning to TDP Leaders

ABOUT THE AUTHOR

...view details