వచ్చేది టీడీపీ,జనసేన ప్రభుత్వమే - చక్రవడ్డీతో సహా అన్నీ చెల్లిస్తాం: నారా లోకేశ్ Nara Lokesh Shankaravam Meeting in Narasannapet:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్ర రెండోరోజు శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్ని కార్యోన్ముఖులను చేయటంతో పాటు జగన్ పీడిత వర్గాలన్నింటికీ భరోసా కల్పించేలా లోకేశ్ శంఖారావం యాత్రకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నరసన్నపేట శంఖారావం సభలో పాల్గొన్న నారా లోకేష్ జగన్‌పై విమర్శలు గుప్పించారు.
జగన్ పని అయిపోయిందని వైసీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. తాడేపల్లి కొంప గేట్లు బద్ధలుకొట్టే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. అలానే దిల్లీలో ఉన్న వైసీపీ ఎంపీలు కూడా జగన్‌కు బైబై అంటున్నారని అన్నారు. జగన్ 151 సీట్లు గెలిచి ఏం సాధించారని ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ కొత్త పథకం తీసుకొచ్చారని అదే ఎమ్మెల్యేల బదిలీ పథకమని లోకేశ్ (lokesh) వ్యంగ్యాస్తాలు సంధించారు. ఒకరింట్లో చెత్త తీసుకొచ్చి పక్కింటి వద్ద వేస్తే బంగారం అవుతుందా అలానే ఒక నియోజకవర్గంలో పనిచేయని వాళ్లు ఇంకో నియోజకవర్గంలో చేస్తారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల బదిలీ తీసుకొచ్చినప్పుడే జగన్ ఓటమిని ఒప్పుకున్నట్లేనని లోకేశ్ అన్నారు.
జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు- పరిశ్రమల ఏర్పాటుతో ఉత్తరాంధ్ర వలసలను నిరోధిస్తాం: లోకేశ్
జే ట్యాక్స్ (J tax) మొత్తం జగన్ జేబుల్లోకి వెళ్తోంది మద్యం విషం కన్నా ప్రమాదంగా మారే పరిస్థితి ఉందని లోకేశ్ అన్నారు. జగన్ సీఎం అవ్వకముందు సంపూర్ణ మద్యపాన నిషేధమని చెప్పి అధికారంలోకి వచ్చాక కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారని విమర్శించారు. మద్యం తయారీ, విక్రయాలన్నీ వాళ్లే చేస్తూ జనం డబ్బు లాగేస్తున్నారని ఆరోపించారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాదుడే బాదుడని అన్నారు. ఆఖరికి చెత్తకు పన్ను కూడా వేశారని అవానే ముందుముందు గాలికి కూడా పన్ను వేస్తారేమోనని విమర్శించారు. దేశ చరిత్రలో వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక సీఎం జగనేనని అన్నారు.
కార్యకర్తలపై కేసులు,వేధింపులకు బదులు ఉంటుంది- పలాస శంఖారావం సభలో గౌతు శిరీష
ఈ సారి అధికారంలోకి వచ్చేది టీడీపీ-జనసేన (TDP-Jansena) ప్రభుత్వమే అని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటామని ఉద్యోగం ఆలస్యమైతే నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. 3 రాజధానుల పేరుతో జగన్ 3 ముక్కలాట ఆడుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడుల్లేవు ఉన్న పరిశ్రమలను తరిమేశారని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయనీయబోమని అవసరమైతే రాష్ట్రమే ఉక్కు పరిశ్రమ కొనుగోలు చేస్తుందని అన్నారు. ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి దోచుకుంటున్నారని భూకబ్జాలు చేస్తూ ఎవరైనా వారిని ప్రశ్నిస్తే ఎదురు కేసులు పెడుతున్నారని లోకేశ్ అన్నారు.
జగన్ సొంత నియోజకవర్గంలోనూ టీడీపీ జెండా ఎగరేస్తాం : అచ్చెన్నాయుడు
MP Rammohan Naidu Comments:వైసీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎంపీ రామ్మోహన్‌నాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం మరచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని (Capital City) లేని రాష్ట్రంగా మార్చారని దుయ్యబట్టారు. మళ్లీ సీఎంగా చంద్రబాబు వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యాన్ని కల్తీ చేశారని ఆ మద్యం తాగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి వచ్చిందని అన్నారు. టీడీపీలో కార్యకర్తలకు, నాయకులకు ఎప్పటికీ అన్యాయం జరగదని మీకు ఏ కష్టం వచ్చినా పార్టీ మీకు అండగా ఉంటుందని ఎంపీ రామ్మోహన్ అన్నారు.