Minister Uttam Kumar Reddy Fires on BJP and BRS :ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా దక్కవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు. బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుందని, మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసివేయడం జరుగుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కలిపిస్తుందని హమీ ఇచ్చారు.
బీజేపీ గత పదేళ్లలో మతతత్వ రాజకీయం తప్ప చేసేందేమీ లేదు : మంత్రి ఉత్తమ్ - Minister Uttam on BJP
"2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచింది. రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంటులో చర్చించాను. గత ఎన్నికల్లో 109 సీట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో కేవలం 39 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఈ 39 మందిలో ఇప్పటికే నలుగురు కాంగ్రెస్ గూటికి రావడం జరిగింది. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి సుమారు 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుంది."- ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి
ఈసారి ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్లకు డిపాజిట్లు కూడా దక్కవు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Etv Bharat) తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో - కీలకమైన 23 అంశాలు ఇవే - TS Congress Special Manifesto 2024
బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లకు ముప్పు : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి - Minister Uttam about Reservation