తెలంగాణ

telangana

ETV Bharat / politics

'రేవంత్ రెడ్డి చరిత్ర ఏంటో తెలుగు రాష్ట్రాలకు తెలుసు - బీఆర్ఎస్​ను​ ముక్కలు చేసే వాళ్లు ఇంకా పుట్టలేదు'

Kadiyam Srihari Comments on CM Revanth Reddy : బీఆర్ఎస్‌ పార్టీని ముక్కలు చేసే వాళ్లు ఇంకా పుట్టలేదని కాంగ్రెస్ నేతల మాటలకు స్టేషన్ ఘన్​పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ పాలకుర్తిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కడియం పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర ఏంటో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా తెలుసని, ఉన్నత పదవిలో ఉన్నప్పుడు కొంచెం హుందాగా ఉండటం నేర్చుకోవాలని హితవు పలికారు.

Kadiyam Fires On Congress Govt
Kadiyam Srihari Comments on CM Revanth Reddy

By ETV Bharat Telangana Team

Published : Jan 28, 2024, 7:21 PM IST

Kadiyam Srihari Comments on CM Revanth Reddy : భారత రాష్ట్ర సమితిని 39 ముక్కలు చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి, 100 మీటర్ల లోతులో బీఆర్ఎస్​ను పాతిపెడతామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలకు స్టేషన్​ ఘన్​పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. గులాబీ పార్టీని(BRS Party) ముక్కలు చేసే వాళ్లు ఇంకా పుట్టలేదని స్పష్టం చేశారు. ఇవాళ పాలకుర్తిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన, రేవంత్​పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర ఏంటో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా తెలుసని, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు కొంచెం హుందాగా ఉండటం నేర్చుకోవాలని హితవు పలికారు. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(BRS Working President) కేటీఆర్‌ దావోస్‌ వెళ్లినప్పుడు ఎంతో హుందాగా ప్రవర్తించారని గుర్తు చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారని చెప్పుకొచ్చారు.

నాడు ప్రచారంలో అబద్ధాలు - నేడు పాలనలో అసహనం : హరీశ్‌రావు

దేశంలోనే రోల్ మోడల్​గా తెలంగాణను అభివృద్ధి చేసిన తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ను ఇష్టమొచ్చినట్లు తిట్టడం సరికాదని హెచ్చరించారు. రేవంత్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో ఇప్పటికే విసుగు మొదలైందని కడియం చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారంలోకి వచ్చి 50 రోజులకు పైగా అవుతోందన్న కడియం, అప్పటి నుంచి అభివృద్ధిని పక్కనబెట్టి బీఆర్ఎస్‌ నేతలపై విమర్శలు చేయటమే ప్రధాన పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.

మా పార్టీ అధ్యక్షుడ కేసీఆర్​ను పట్టుకొని చార్లెస్ సోమరాజ్ అంటావా? హరీశ్​రావు, కేటీఆర్​లను బిల్లా రంగా అంటావా? వారందరి కన్నా పెద్ద చరిత్ర మీది రేవంత్ రెడ్డి. మీ చరిత్ర తెలుగు రాష్ట్రాలకు తెలుసు. మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఉన్నత విలువలతో మంచిగా మాట్లాడాలి. అంతేకానీ దిగుజారుడు మాటలు తగదు. అలాంటివి మాట్లాడేటప్పుడు అవి తిరిగి ఏ విధంగా వస్తాయనే విషయం ఆలోచించి మెలగాలి. - కడియం శ్రీహరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే

బీఆర్ఎస్​ను​ ముక్కలు చేసే వాళ్లు ఇంకా పుట్టలేదు : కడియం శ్రీహరి

Kadiyam Srihari Fires on CM Revanth Reddy :కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి యాభై రోజులు గడిచినా కూడా రైతులకు రైతు బంధు(Rythu Bandhu) ఇవ్వలేని పరిస్థితిలో ఉందని నిట్టూర్చారు. రైతులకు క్వింటాకు బోనస్ ఇస్తామని మరిచారని విమర్శించారు. ప్రజలను మోసం చేసే హామీలు ఇచ్చిన ఈ ప్రభుత్వానికి, లోక్​సభ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.

అదేవిధంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament Election) బీఆర్ఎస్​కు అధిక ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యకర్తలంతా సైనికుల మాదిరిగా పని చేయాలని పిలుపునిచ్చారు. గులాబీ బాస్​ కేసీఆర్‌ను అనవసరంగా ఓడించామని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. ఇక రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా గులాబీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

హామీలు తప్పించుకునేందుకే రోజుకో అవినీతి కథ - అధికారం చేతుల్లోనే ఉందిగా వెలికితీయండి : కేటీఆర్‌

బీఆర్ఎస్​ను బొంద పెట్టే మొనగాడు పుట్టలేదు : కడియం శ్రీహరి

ABOUT THE AUTHOR

...view details