BRS Election Campaign In Telangana : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు మరో 13 రోజులే ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ప్రధాన పార్టీల అగ్రనేతలు సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తుండగా అభ్యర్థులు ఊరూరా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది.
Vinod Kumar Campaign in Jammikunta Today : కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, కౌశిక్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. పదేళ్లలో కేసీఆర్ సర్కార్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్కు ఓటేసి తమను గెలిపించాలని కోరారు. 100 రోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామని ఇప్పుడు వాటికి లోక్‌సభ ఎన్నికలను లింక్ చేస్తున్నారని విమర్శించారు.
BRS MLA Jagadish Reddy Comments: మరోవైపు కాంగ్రెస్, బీజేపీ లోపాయకారి ఒప్పందాలు ఒక్కొక్కొటిగా బహిర్గతమైతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారం చేస్తూ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు చేశారు. బీజేపీ ముస్లిం రిజర్వేషన్ల రద్దు పేరుతో మొత్తం రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. ప్రజల్లో సెంటిమెంటును రగిలించి పబ్బం గడుపుకునేందుకు కాషాయ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆ ఒప్పందంలో భాగమే రేవంత్‌కు నోటీసుల డ్రామా అని వ్యాఖ్యానించారు.