తెలంగాణ

telangana

ETV Bharat / politics

రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పాలన మారలేదు : ఈటల రాజేందర్‌ - Etela Rajender Comments on Congress - ETELA RAJENDER COMMENTS ON CONGRESS

Etela Rajender Comments on Congress Party : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణంలోని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పాలన మాత్రం మారలేదని, అమలు కానీ హామీలతో కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు.

BJP MLC Election Campaign
Etela Rajender Comments on Congress Party (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 19, 2024, 7:38 PM IST

BJP Leader Etela Rajender Comments on Revanth Govt :గత రాష్ట్ర ప్రభుత్వం తీరుగానే కాంగ్రెస్ సర్కార్‌ పాలన కొనసాగిస్తుందని, మార్పు ఎక్కడ కనిపించట్లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. అమలు కానీ అనేక హామీలను కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసి విస్మరిస్తుందని మండిపడ్డారు. కానీ ప్రధాని మోదీ దేశం ముఖ్యం అని భావించి, ప్రపంచంలో దేశాన్ని మంచి స్థానంలో పెట్టాలని కృషి చేస్తున్నారని పవర్ ఓరియెంటెడ్ కాకుండా పీపుల్స్ ఓరియెంటెడ్ పాలన అందిస్తున్నారన్నారు.

ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ : అందువల్లే పదేళ్ల పాలన తర్వాత కూడా ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అని దేశ ప్రజలు నినదిస్తున్నారని చెప్పారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మేధావులంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎవరి క్యారెక్టర్ ఏమిటి? ఎవరి కమిట్​మెంట్ ఏంటో చూసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

నరేంద్ర మోదీ సంకీర్ణ రాజకీయాలకు స్వస్తి పలికారని, భారత్ ఇప్పుడు ఐదవ ఆర్థిక వ్యవస్థకు తీసుకు వచ్చారన్నారు. దీనిని మూడో స్థానానికి తీసుకురావడమే లక్ష్యంగా మోదీ పని చేస్తున్నట్లు చెప్పారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న విధంగా గోకుల్ చాట్ బాంబు దాడులు, సరిహద్దుల్లో సైనికుల మృతులు నేడు ప్రధాని పాలనలో లేవని తెలిపారు.

"నాడు సంకీర్ణ రాజకీయాల్లో ఎన్ని స్కామ్‌లు జరిగాయో అందరికీ తెలుసు. కోల్‌ స్కాం, 2జీ స్కాం, భోపాల్ స్కాం మొదలగు అవినీతి చర్యలన్నీ సంకీర్ణ రాజకీయాలు దేశాన్ని పాలించినప్పుడు జరిగినవే. ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీనే ప్రధాన పార్టీ."-ఈటల రాజేందర్‌, మాజీ మంత్రి

BJP MLC Election Campaign :పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు ఊహించని, ఏ సర్వే సంస్థలు చెప్పలేని రిజల్ట్ వస్తుందని ఈటల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ జిల్లా ఆ జిల్లా అంటూ తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ కమలానికే ఓటు వేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లాకు వచ్చిన ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ప్రజలందరూ ఒక్కటే ఆలోచనతో దేశ రక్షణ కోసం, దేశ పురోగతి, అంతర్గత భద్రత, దేశాన్ని ప్రపంచ పటంలో చూపించాలంటే మళ్లీ మోదీనే ప్రధాని కావాలని ప్రజల కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఆరు నెలలకే ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు తప్ప ఇంకేమైనా చేసిందా అని ప్రశ్నించారు. మహిళలకు రూ.2500, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదని, కనీసం రూపాయి ఖర్చు లేని రేషన్‌కార్డు కూడా ఇవ్వలేక పోయిందని హస్తంపై మండి పడ్డారు.

Etela Comments on CM Revanth : ముఖ్యమంత్రికి తనపై తనకే విశ్వాసం లేక దేవుళ్లపై ఒట్టేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈనెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా బీజేపీ అభ్యర్థినే గెలవనునట్లు జోస్యం చెప్పారు. కాషాయ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గెలుపుకోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మారినా - పాలన మారలేదు : ఈటల రాజేందర్‌ (ETV Bharat)

రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు బీజేపీకే, నల్గొండలో భారీ మెజారిటీ ఖాయం : ఈటల రాజేందర్ - Etela Rajender on BJP MP Seats

మేం ఆశించినట్లుగానే రాష్ట్రంలో బీజేపీకి రెండంకెల ఎంపీ సీట్లు వస్తాయి : కిషన్ ​రెడ్డి - Kishan Reddy on BJP MP seats

ABOUT THE AUTHOR

...view details