ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / opinion

వైసీపీ పాలనలో విలవిల్లాడుతున్న విశాఖ - VISAKHA FACING PROBLEMS

Pratidwani Debate on Why Capital of Visakha: విశాఖ నగరం వైసీపీ పాలనలో విలవిల్లాడుతోంది. జగన్‌ అధికారంలోకి వచ్చాక విశాఖ నుదుటి రాత మారిపోయింది. ఐదు సంవత్సరాలలో నగరంలో ప్రదేశాలను మొత్తం దోచేశారు. విశాఖకు బ్రెజిల్ నుంచి డగ్స్‌ రావడం రాష్ట్ర ప్రజలను షాక్‌కు గురి చేశాయి. విశాఖను పాలన రాజధానిని చేస్తానన్న జగనన్న చివరకి దేనికి రాజధానిగా చేశారో నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం

Why Capital of Visakha
Why Capital of Visakha

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 11:02 AM IST

Pratidwani: సుందర సముద్ర తీర విశాఖకు తుపాన్లు కొత్త కాదు. మహామహా ఉత్పాతాలనే తట్టుకున్న ఆ అద్భుత నగరం వైసీపీ పాలనలో విలవిల్లాడుతోంది. 2019లో జగన్‌ అధికారంలోకి వచ్చాక విశాఖ నుదుటి రాత తిరగబడింది. వైసీపీ మూకలు ఆ మహానగరంపై వాలిపోయాయి. ఐదు సంవత్సరాలలో విలువైన భూములు, కొండలు, గుట్టలు, సముద్రతీరాన్ని కూడా మింగేశారు. అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్నే రౌడీలు కిడ్నాప్ చేశారు. గంజాయి ముఠాలు చాలా కాలంగా పేట్రేగిపోతున్నాయి. ఇప్పుడు కొత్తగా బ్రెజిల్ నుంచి వచ్చిన డగ్స్‌ రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేశాయి. విశాఖను పాలన రాజధానిని చేస్తానన్న జగనన్న చివరికి దేనికి రాజధానిగా చేశారు? ఈ అంశాలపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది.

విశాఖపట్నంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చాలా కాలం క్రితం అక్కడ ఏం జరుగుతుందనేది అమిత్‌షా ఎప్పుడో చెప్పారు. ఇటీవల భారీ డ్రగ్స్‌తో కూడిన ఓ నౌక విశాఖకు వచ్చిన ఉదంతం వరకు చూస్తుంటే వైసీపీ వాళ్లు వైజాగ్ కేంద్రంగా ఏం చేస్తున్నారు? 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే మొట్టమొదటగా మీకు సంబంధించిన వారి భూమిని కబ్జా చేయాలని చూస్తే మీరు దానిపై గట్టిగా పోరాడారు. ఆ తర్వాత ఏం జరిగింది? అలాంటి ఘటనలు రానురాను పెరిగాయా? తగ్గాయా? ఇప్పుడు పరిస్థితి ఏంటి?

జగన్ సీఎం అయ్యాక కట్టిన కొత్త ప్రాజెక్టులు ఏవి ? సాగు, తాగునీటిపై ప్రజలకు​ చేసిందేంటి? - YCP Not completeIrrigation Projects

విశాఖ పరిసర ప్రాంతాల్లో గత నాలుగు సంవత్సరాలుగా గంజాయి సాగు విపరీతంగా పెరిగిందని, అక్కడి నుంచే రవాణా జరుగుతోందని ఎన్నో వార్తలోచ్చాయి. విశాఖపై మాదక ద్రవ్యాల ప్రభావం ఎలా ఉంది? 2014లో హుద్‌హుద్‌ వంటి కనీవినీ ఎరుగని ప్రకృతి విపత్తుకు విశాఖ గురైంది. అయినా స్వచ్ఛ భారత్‌ అవార్డుల్లో దేశంలోనే ఒక ఉత్తమ నగరంగా నిలిచింది. గత ప్రభుత్వ హయాంలో విశాఖ ఎలా ఉండేది? ఇప్పుడు ఏ విధంగా ఉందో పరిస్థితులను బట్టి తెలుస్తుంది. విశాఖ అంటేనే ప్రకృతి. అందమైన సముద్ర తీరం, పచ్చటైన కొండలు. మీరు న్యాయపోరాటం కూడా చేస్తున్నారు కదా! ఈ రెండింటిని వైసీపీ ఎలా చెరబట్టింది? మీరు విశాఖ నగరాభివృద్ధికి సంబంధించి అనేక కమిటీల్లో ఉన్నారు.

విశాఖ పుర ప్రముఖుల్లో ఒకరైన న్యాయవాది పలక శ్రీరామ్‌మూర్తి నగర వాసులు వైసీపీ పాలన గురించి ఏం అనుకుంటున్నారో ఆయన తెలిపారు. విశాఖ వాసులు ఈ ప్రభుత్వం మళ్లీ రావాలి అనుకుంటున్నారా? వైజాగ్​ను జగన్ అయితేనే పాలనా రాజధాని చేస్తాడని, అది కావాలని అనుకుంటున్నారో లేదో శ్రీరామ్​మూర్తి తెలిపారు. విశాఖలో రౌడీయిజం గురించి వైసీపీ పార్టీ ఎంపీ సత్యనారాయణ, భూకబ్జాలపై మంత్రి ధర్మాన వ్యాఖ్యలు కూడా చేశారు. అధికార వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యులను రౌడీలు కిడ్నాప్ చేశారు. కడప సుబ్బారెడ్డి భూకబ్జాలకు వచ్చాడని మంత్రి ధర్మాన అన్నారు. వైసీపీ కీలకనేతలే అలా చెప్పడంతో ఇంక సామాన్యులకు రక్షణ ఎక్కడుందని ప్రజలు అంటున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు.

బట్టబయలైన వైసీపీ, వాలంటీర్ల బంధం - రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం ప్రజలు ఏం చేయాలి? - Volunteers Working for YSRCP

ABOUT THE AUTHOR

...view details