తెలంగాణ

telangana

ETV Bharat / opinion

జమిలి ఎన్నికలకు మొగ్గు చూపుతున్న కేంద్రం - ఏకస్వామ్య పార్టీ పాలన వస్తుందనే భయం - Experts Discussion Jamili Elections - EXPERTS DISCUSSION JAMILI ELECTIONS

Prathidhwani on Jamili Elections in INDIA : దేశంలో 'ఒకే దేశం- ఒకే ఎన్నిక'పై మరోసారి చర్చకు తెరలేచింది. పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల ప్రతిపాదన చర్చకు దారితీసింది. రెండోదశలో దేశమంతా స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ వేసింది. కేంద్ర కేబినెట్ పరిశీలనకు ఉన్నతస్థాయి కమిటీ నివేదిక వెళ్లింది. ఈ అంశంపై మరో నివేదిక న్యాయశాఖ సమర్పించనున్నది. పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నయి. మరి సాధ్యమవుతుందా లేదో నిపుణలు మాటల్లో తెలుసుకుందాం.

Prathidhwani on Jamili Elections in INDIA
One Nation One Election (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 16, 2024, 12:42 PM IST

Prathidhwani on Jamili Elections in INDIA : దేశవ్యాప్తంగా పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి జమిలిగా ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనపై చర్చకు మరోసారి తెరలేచింది. 'ఒకే దేశం- ఒకే ఎన్నిక' విధానంపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన నివేదిక కేంద్ర మంత్రిమండలి పరిశీలనకు రానుంది. వరుస ఎన్నికల వల్ల అపరిమితంగా పెరుగుతున్న వ్యయం, ఎన్నికల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశ్యంతో జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. అయితే ఈ తరహా ఎన్నికలపై రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావివర్గంలో భిన్నాభిప్రాయాలున్నాయి.

One Nation One Election : ఈ నేపథ్యంలో అసలు జమిలి ఎన్నికల ప్రతిపాదన ఎలా ముందుకొచ్చింది? ఇలాంటి వ్యవస్థ ఎక్కడైనా సమర్థంగా అమలవుతోందా? ఒకే దేశం- ఒకే ఎన్నిక ఆచరణ సాధ్యం కావాలంటే జరగాల్సిన రాజ్యాంగ ప్రక్రియలు ఏంటి? ఇదే నేటి ప్రతిధ్వని. అసెంబ్లీ కాలపరిమితి అర్ధాంతరంగా ముగిస్తే పరిష్కారమెలా? అవిశ్వాస పరీక్షల్లో ఓడిపోతే ఆ ప్రభుత్వాలు నడిచేదెలా? కేంద్రంలోని అధికార పార్టీనే రాష్ట్రాల్లో పట్టు బిగిస్తుందనే వాదన ఉందని నిపుణలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏకస్వామ్య పార్టీ పరిపాలనకు దారితీస్తుందన్న భయాలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి వ్యవస్థ ఎక్కడైనా సమర్థంగా అమలవుతోందా? జమిలి ఎన్నికల అమలుకు జరగాల్సిన రాజ్యాంగ ప్రక్రియేంటి రాష్ట్రాల అభిప్రాయాలకు ఇందులో ఎంత మేరకు చోటుంటుంది?

ABOUT THE AUTHOR

...view details