తెలంగాణ

telangana

ETV Bharat / opinion

శివరాత్రి ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా ? - DEBATE ON FASTING BENEFITS

ఉపవాసంతో ఆరాధనతో పాటు ఆరోగ్యం - అధిక బరువు నుంచి మధుమేహం సమస్యలకు చెక్.

Fasting Benefits
Prathidhwani Debate On Fasting Benefits (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2025, 7:26 AM IST

Prathidhwani Debate On Fasting Health Benefits : ఉపవాసం అంటే కేవలం ఆరాధనే కాదు ఆరోగ్యమూ ఇమిడి ఉంది. అది తెలిసే పూర్వం నుంచి మన పెద్దలు ఏకాదశీ తిథినాడు, మహా శివరాత్రి వంటి పర్వదినాల్లో, కార్తికమాసం వంటి పవిత్ర మాసాల్లో ఉపవాసం ఉండాలని చెప్పేవారు. నేటికీ చాలామంది తమ ఇష్ట దేవతలకు ప్రీతికరమైన రోజుల్లో వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటారు.

బ్రేక్‌ఫాస్ట్‌ నుంచి రాత్రి భోజనందాకా ఓ పది గంటల వ్యవధిలో ముగించేసి మిగిలిన 14 గంటలూ కడుపును ఖాళీగా ఉంచితే ఆ ఉపవాసం మనకి శ్రీరామరక్ష అవుతుందని వైద్యులు చెబుతున్నారు. అధిక బరువు నుంచి మధుమేహం దాకా జీవనశైలి రుగ్మతలన్నీ అదుపులోకి వస్తాయని అంటున్నారు. ఉపవాసం లేదా ఫాస్టింగ్‌లో ఉన్న ఆధ్యాత్మిక, ఆరోగ్యపరమైన అంశాలపై చర్చిద్దాం.

ABOUT THE AUTHOR

...view details