తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

సీజనల్​ స్పెషల్​ - ఘాటైన రుచితో "ఉసిరికాయ రసం" - ఇలా చేసుకుని తింటే ఎన్నో ప్రయోజనాలు​! - HOW TO MAKE HEALTHY USIRIKAYA RASAM

-ఉసిరికాయలతో పప్పు, పచ్చడే కాదు ఇది ట్రై చేయండి -ఇలా చేస్తే అన్నంలోకి తినడమే కాదు తాగేస్తారు కూడా

How to Make Healthy Usirikaya Rasam
How to Make Healthy Usirikaya Rasam (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2024, 4:33 PM IST

How to Make Healthy Usirikaya Rasam:ఉసిరికాయల సీజన్​ మొదలైపోయింది. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసిన ఇవి విరివిగా లభిస్తున్నాయి. ఈ ఉసిరిలోని ఔషధ గుణాలు.. మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనందరికీ తెలిసిందే. అయితే.. ఉసిరికాయలు అనగానే చాలా మందికి నిల్వ పచ్చడి మాత్రమే గుర్తుకువస్తుంది. కానీ ఉసిరికాయలతో పప్పు, ఇన్​స్టంట్​ పచ్చడి, రైస్​ కూడా చేసుకోవచ్చు. అలాగే ఘాటైన రసం కూడా చేసుకోవచ్చు. చలికాలంలో వేడి వేడి అన్నంలో ఈ చారు పోసుకుని తింటుంటే కలిగే ఫీలింగ్​ వేరే లెవల్​. మరి లేట్​ చేయకుండా ఎంతో టేస్టీగా మరెంతో ఘాటుగా ఉండే ఉసిరికాయ చారును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

  • ఉసిరికాయలు - 4(నిమ్మకాయ సైజ్​)
  • మిరియాలు - 1 టీ స్పూన్​
  • జీలకర్ర - 1 టీ స్పూన్​
  • బాగా పండిన మీడియం సైజ్​ టమాటలు - 2
  • నూనె - 1 టేబుల్​ స్పూన్​
  • ఆవాలు - 1 టీ స్పూన్​
  • జీలకర్ర - అర టీ స్పూన్​
  • ఇంగువ - చిటికెడు
  • కరివేపాకు - 2 రెబ్బలు
  • ఎండు మిర్చి - 2
  • అల్లం తరుగు - 1 టీ స్పూన్​
  • పచ్చిమిర్చి - 1
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - అర టీ స్పూన్​
  • నీరు - ఒకటింపావు లీటర్లు
  • కందిపప్పు పేస్ట్​ - పావు కప్పు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం:

  • ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి ఉడికించి పేస్ట్​లాగా చేసి పక్కన పెట్టాలి.
  • ఇప్పుడు ఉసిరికాయల్లో గింజలు తీసి ముక్కలు చేసి పక్కన పెట్టాలి. అలాగే పచ్చిమిర్చి, అల్లం సన్నగా తరగాలి. అంతే పండిన టమాటలను ముక్కలుగా కట్​ చేసి తీసుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీజార్​లోకి కట్​ చేసిన ఉసిరికాయ ముక్కలు, మిరియాలు, టమాట ముక్కలు, జీలకర్ర వేసి పావు కప్పు నీరు పోసి మెత్తని పేస్ట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్​ పెట్టి అందులోకి నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్​ హీట్​ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువు వేసి ఆవాలు చిటపటలాడించాలి.
  • ఆ తర్వాత కరివేపాకు, ఎండు మిర్చి వేసి వేయించుకోవాలి.
  • అందులోకి తరిగిన అల్లం, పచ్చిమిర్చి చీలికలు వేసి ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత గ్రైండ్​ చేసుకున్న ఉసిరికాయ టమాట మిశ్రమం వేసి కలుపుకోవాలి. అనంతరం రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ఒకటింపావు నీళ్లు పోసి బాగా కలిపి స్టవ్​ను మీడియం ఫ్లేమ్​ మీద పెట్టి చారు ఓ పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. సుమారు ఓ 10 నిమిషాల టైమ్​ పడుతుంది.
  • చారు మరుగుతున్నప్పుడు ఉడికించి పేస్ట్​లాగా చేసిన కందిపప్పు వేసి మరో మూడు నిమిషాలు మరిగించాలి.
  • ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి దింపుకుంటే చాలు. ఎంతో టేస్టీగా, ఆరోగ్యాన్నిచ్చే ఉసిరికాయ చారు రెడీ.

ABOUT THE AUTHOR

...view details