తెలంగాణ

telangana

By ETV Bharat Features Team

Published : 4 hours ago

ETV Bharat / offbeat

పప్పులు నానబెట్టకుండానే బియ్యంతో "చిట్టి పునుగులు" - టేస్ట్ బండ్లపై దొరికే వాటికి ఏమాత్రం తీసిపోదు! - How to Make Punugulu Easily

Punugulu Recipe in Telugu: ఎక్కువ మందికి ఇష్టమైన ఈవెనింగ్ స్నాక్ ఐటమ్​లలో ఒకటి.. పునుగులు. అలాంటి వారికోసం ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా పునుగులు చేసుకునేలా ఒక స్పెషల్ రెసిపీ తీసుకొచ్చాం. ఇంతకీ.. ఆ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Make Punugulu Easily
Punugulu Recipe (ETV Bharat)

How to Make Punugulu Easily at Home: సాయంకాలం అయ్యిందంటే చాలు.. చాలా మందికి ఏదో ఒక స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలోనే కొందరు అలా బయటకు వెళ్లి రోడ్ సైడ్ బండ్ల దగ్గర పునుగులు, బజ్జీలు, గారెలు వంటివి టేస్ట్ చేస్తుంటారు. అందులో.. పునుగులు ఇష్టపడే వారు చాలా ఎక్కువే. వాటికి ఉండే క్రేజ్, టేస్ట్ అలాంటిది మరి! కానీ.. వాటిని ఇంటి వద్దే ఎలాంటి పప్పులు నానబెట్టకుండా, పెరుగు, సోడా లేకుండా బియ్యంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా టేస్ట్ బండ్లపై దొరికే వాటికి ఏమాత్రం తీసిపోదు! ఇంతకీ.. అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యం - 1 కప్పు
  • బంగాళదుంపలు - 3
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పచ్చిమిర్చి - 2
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • జీలకర్ర - 1 స్పూన్
  • నూనె - వేయించడానికి సరిపడా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా బియ్యాన్ని రెండు నుంచి మూడు గంటలపాటు నానబెట్టుకోవాలి. అయితే, ఇక్కడ మీరు మామూలు రైస్ కూడా తీసుకోవచ్చు. కానీ, రేషన్ బియ్యమైతే పునుగులు కాస్త జిగురు జిగురుగా రావడమే కాదు సూపర్ టేస్టీగా ఉంటాయి.
  • బియ్యం నానేలోపు బంగాళదుంపలను ఉడికించి పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ వడకట్టి మిక్సీ జార్​లో వేసుకోవాలి. ఆపై కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కాస్త గట్టిగానే ఉండేలా మెత్తని పేస్ట్​లా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దాన్ని ఒక మిక్సింగ్ బౌల్​లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలూ ముక్కలను మిక్సీ జార్​లో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆలూ పేస్ట్​ని ముందుగా మిక్సీ పట్టుకున్న బియ్యప్పిండిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
  • ఆపై అందులో ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసి అన్నీ కలిసేలా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అలా కలుపుతున్నప్పుడే అందులో జీలకర్ర కూడా వేసి మిక్స్ చేసుకోవాలి.
  • అయితే, పిండి మరీ పల్చగా ఉండకుండా కాస్త గట్టిగానే ఉండేలా కలుపుకోవాలి. అలాగే పిండి ఎక్కువ గట్టిగా అనిపిస్తే కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు.
  • ఆవిధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక.. ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక.. చేతితో కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ పునుగుల మాదిరిగా వేసుకోవాలి.
  • ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి గరిటెతో వాటిని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ అవి మంచిగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో సోడా వేయకున్నా సరే పనుగులు చాలా చక్కగా పొంగుతూ సాఫ్ట్​గా వస్తాయి.
  • అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. ఇవి మామూలు పనుగుల మాదిరిగా గోల్డెన్ బ్రౌన్​ కలర్​లోకి రావు. కాస్త వైట్​ కలర్​లోనే ఉంటాయి.
  • కాబట్టి.. లైట్​ కలర్​ మారాక వాటిని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకొని ప్లేట్​లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. సూపర్ టేస్టీగా ఉండే "చిట్టి చిట్టి పునుగులు" రెడీ!
  • ఇక వీటిని ఆనియన్స్, టమాటా చట్నీతో తింటుంటే ఆ టేస్ట్ భలే ఉంటుంది!

ABOUT THE AUTHOR

...view details