Doodh Well water In karimnagar: కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి కాలంలో కరీంనగర్ జిల్లా మొలంగూర్‌లో కోట నిర్మాణం పూర్తికాగా.. ఆ కోట ప్రవేశద్వారం ఎదురుగా పూర్తి రాతి ట్టడంతో నిర్మితమైన దూద్‌బావి నీటి గురించి గొప్పగా చెప్పుకుంటారు ప్రజలు. ఇప్పటికీ ప్రజలు, చరిత్రకారులకు ఆ దూద్‌బావిలో నీరు తెల్లగా పాల మాదిరిగా ఉండటానికి కారణమేమిటో ప్రశ్నార్థకంగానే మిగిలింది. శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామంలోని దూద్‌బావి నీటి గురించి ఎంతగా వర్ణించి చెప్పినా తక్కువే.
Molangur Doodh Well :అడుగు మొదలుపై భాగం వరకు రాతి కట్టడంతో ఉన్న దూద్‌బావి నీటిలో నాణెం వేసినా అది స్పష్టంగా కనిపించడం ఆ బావిలోని నీటి పారదర్శకతకు నిదర్శనం. దూద్‌బావి నీటిని తాగితే ఎలాంటి రుగ్మతలు దరిచేరవని పరిసర గ్రామాల ప్రజలు గట్టిగా విశ్వసిస్తారు. ఆ బావివి చూసేందుకు పలు ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు.
పాలు, నీళ్లు కలిపిన రీతిలో తెల్లగా ఉండే ఆ బావి నీటిని నిజాం నవాబు తన తాగునీటి అవసరాల కోసం గుర్రాలపై ఇక్కడి నుంచి తెప్పించుకునే వారని స్థానికులు చెబుతున్నారు. బావిలో ఊటనీరు చేరుకోగానే తోడుకుని వెళ్ళేందుకు వీలుగా రాత్రి మొదలు తెల్లవార్లు ప్రజలు ఆ బావి వద్ద జాగరణ చేసే దృశ్యాలు నిత్యకృత్యం. ఐతే ఏళ్ళ తరబడి చరిత్రగానే మిగిలిపోయిన దూద్‌బావిలోని నీటి విశిష్టతను అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో పరీక్షించారు.