తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

హైద్రాబాద్​ To శ్రీలంక - రామాయణ జ్ఞాపకాలు చూసొస్తారా? - IRCTC స్పెషల్​ ప్యాకేజీ! - IRCTC Sri Lanka Ramayana Yatra

IRCTC Sri Lanka Tour Package: శ్రీలంక వెళ్లాలనుకుంటున్నారా? రామాయణ కాలం నాటి దృశ్యాలను చూడాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. తెలుగువారి కోసం IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

IRCTC Sri Lanka Tour Package
IRCTC Sri Lanka Ramayana Yatra with Shankari Devi Shakthi Peeth (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 8, 2024, 12:21 PM IST

IRCTC Sri Lanka Ramayana Yatra with Shankari Devi Shakthi Peeth: రామాయణ కాలం నాటి పురాతన చరిత్ర కలిగిన ద్వీప దేశం శ్రీలంక. ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సుందరమైన ప్రకృతి దృశ్యాలు అక్కడ ఉంటాయి. మరి ఆ ప్రదేశాలను మీరూ చూడాలనుకుంటున్నారా? అయితే తెలుగువారి కోసం IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు ఉంటుంది? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో ఇప్పుడు చూద్దాం.

ఐఆర్​సీటీసీ.. శ్రీ రామాయణ యాత్ర విత్​ శంకరీ దేవి శక్తి పీఠం పేరుతో ప్యాకేజీని అందిస్తోంది. ఈ యాత్రలో శ్రీలంకలోని హిందూ దేవాలయాలు, రామాయణ పురాణ గాథతో అనుబంధించిన ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ మొత్తం 4 రాత్రులు, 5 పగళ్లు కొనసాగనుంది. హైదరాబాద్​ నుంచి ఫ్లైట్​ జర్నీ ద్వారా ఈ టూర్​ ఆపరేట్​ చేస్తున్నారు.

ప్రయాణం ఇలా ఉంటుంది:

  • మొదటి రోజు ఉదయం 06:30 గంటలకు హైదరాబాద్(Hyderabad Airport) అంతర్జాతీయ విమానాశ్రయంలో రిపోర్ట్ చేయాలి. ఆ తర్వాత విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు శ్రీలంక చేరుకుంటారు. అక్కడి నుంచి దంబుల్లాకు వెళ్తారు. మార్గమధ్యలో చిలావ్‌లోని మునీశ్వరం ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం మనవేరి ఆలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి దంబుల్లాకు చేరుకుంటారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయ్యి ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
  • రెండో రోజు హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత చెక్ అవుట్ అయ్యి ట్రింకోమలీకి వెళ్లి తిరుకోణేశ్వర్, లక్ష్మీనారాయణ ఆలయాన్ని దర్శించుకుంటారు. లంచ్​ తర్వాత కాండీకి వెళ్తారు. ఇక ఆ రోజంతా కాండీలో పలు ప్రసిద్ధి చెందిన.. జెమ్స్ ఫ్యాక్టరీ / బాటిక్ ఫ్యాక్టరీ, టూత్ టెంపుల్ ( ప్రపంచ ప్రసిద్ధ గౌతమ బుద్ధుని ఆలయం) వంటి ప్రదేశాలను విజిట్​ చేయవచ్చు. ఆ రాత్రికి కాండీలో బస ఉంటుంది.

పూరీ జగన్నాథ ఆలయం To శ్రీరాముని జన్మస్థలం - వయా వారణాసి - తక్కువ ధరలో IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ!

  • మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత నువారెలియా వెళ్తారు. మార్గ మధ్యలో రాంబోడాలోని భక్త హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంటారు. తర్వాత సీత అమ్మన్ ఆలయం, సీతా ఎలియా, అశోక వాటిక సందర్శించి ఆ తర్వాత తిరిగి కాండీకి చేరుకుంటారు. ఆ రాత్రికి కాండీ హోటల్​లో బస ఉంటుంది.
  • నాలుగో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. పిన్నవాలా ఎలిఫెంట్ అనాథాశ్రమాన్ని సందర్శిస్తారు. తర్వాత కొలంబో పయమవుతారు. పంచముగ ఆంజనేయర్ ఆలయం, కెలనియా బుద్ధ దేవాలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం కొలంబోలో షాపింగ్​ చేసి ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
  • ఐదో రోజు ఉదయం బ్రేక్​ ఫాస్ట్​ అనంతరం హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి.. క్లాక్ టవర్, గాల్ ఫేస్, కొలంబో హార్బర్, బైరా లేక్, ఇండిపెండెన్స్ స్క్వేర్, నేషనల్ మ్యూజియం, నేలమ్ పోకునా థియేటర్, టౌన్ హాల్‌ వంటి విజిట్​ చేస్తారు. లంచ్​ తర్వాత ఎయిర్​పోర్ట్​లో డ్రాప్​ చేస్తారు. అక్కడి నుంచి హైదరాబాద్​ చేరుకోవడంతో టూర్​ పూర్తవుతుంది.

ధర వివరాలు:ఈ ప్యాకేజీకి సంబంధించిన ధర వివరాలు చూస్తే..

  • కంఫర్ట్​లో సింగిల్​ షేరింగ్​కు రూ.70,450, ట్విన్​ షేరింగ్​కు రూ.57,560, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.54,400 గా నిర్ణయించారు.
  • ఇక పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ.44,320, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ. 42,090గా నిర్ణయించారు.

ఈ ప్యాకేజీలో కవర్​ అయ్యేవి ఇవే:

  • ఫ్లైట్​ ఛార్జీలు కవర్​ అవుతాయి.
  • హోటల్​ అకామడేషన్​ ఉంటుంది.
  • 4 బ్రేక్​ఫాస్ట్​, 5 లంచ్​, 4 డిన్నర్​లు ఉంటాయి.
  • టూర్​ గైడ్​ అందుబాటులో ఉంటారు. ప్యాకేజీలో చెప్పిన ప్రదేశాల ఎంట్రీ ఫీజులు కవర్​ అవుతాయి.
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​ ఉంటుంది.
  • ప్రస్తుతం ఈ టూర్​ సెప్టెంబర్​ 15 నుంచి అందుబాటులో ఉంటుంది.
  • ఈ టూర్​కు సంబంధించి పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

IRCTC అద్భుతమైన ఆధ్యాత్మిక టూర్ - తక్కువ ధరకే ఏడు జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం!

శ్రావణమాసం స్పెషల్​ : అరుణాచలం TO తంజావూర్​ - అతి తక్కువ ధరకే IRCTC సూపర్​​ ప్యాకేజీ!

ABOUT THE AUTHOR

...view details