IRCTC Jai Kashi Viswanath Gange Tour Package: హైదరాబాద్ నుంచి కాశీకి IRCTC సూపర్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్లో ప్రయాగ్ రాజ్, సారనాథ్, వారణాసి ప్రాంతాలను సందర్శించవచ్చు. మొత్తంగా 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ట్రైన్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజ్‌ను ఆపరేట్ చేస్తున్నారు.
ప్రయాణం ఇలా ఉంటుంది:
- మొదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 9.25 గంటలకు ట్రైన్ జర్నీ(ట్రైన్ నెం 12791) స్టార్ట్ అవుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
- రెండో రోజు మధ్యాహ్నం 1.30 గంటల వారణాసి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ముందుగానే బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు.
- అక్కడ చెకిన్ అయిన తర్వాత.. సాయంత్రం గంగా హారతి ఉంటుంది. ఆ రాత్రికి వారణాసిలోనే బస చేస్తారు.
- మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత వారణాసిలో కాశీ విశ్వనాథ్ మందిర్, కాల భైరవ మందిర్, బీహెచ్‌యూ మందిర్లను సందర్శిస్తారు. సమయం లభిస్తే షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఆ రాత్రి వారణాసిలోనే ఉంటారు.
- నాలుగో రోజు అల్పహారం తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత సారనాథ్ వెళ్తారు. అక్కడ పలు ప్లేసెస్ విజిట్ చేసిన తర్వాత అక్కడ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తారు. మార్గమధ్యంలో వింద్యాచల్ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. రాత్రి వరకు ప్రయాగ్‌రాజ్ చేరుకుంటారు. ఆ రోజు అక్కడే బస చేస్తారు.
ఐఆర్‌సీటీసీ "గ్లోరీ ఆఫ్ గుజరాత్ విత్ మౌంట్ అబూ" - ఈ ప్రదేశాలు చూడొచ్చు! ధర కూడా తక్కువే!
- ఐదో రోజు ఉదయం త్రివేణి సంగమానికి సందర్శించుకుంటారు. అనంతరం హోటల్‌కి వెళ్లి బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత.. మధ్యాహ్నం సమయంలో చెక్ అవుట్ అవుతారు. అనంతరం ఆనంద్ భవన్, కుస్రో బాగ్‌కు వెళ్తారు. సాయంత్రం వరకు ప్రయాగ్ రాజ్ రైల్వే జంక్షన్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి రాత్రి 7:45 గంటలకు హైదరాబాద్‌కు రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
- ఆరో రోజు రాత్రి 09.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ కంప్లీట్ అవుతుంది.