తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

నోరూరించే "కొబ్బరి హల్వా" - ఈ పద్ధతుల్లో చేస్తే ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది! - How to Prepare Coconut Halwa

Coconut Halwa: పచ్చి కొబ్బరితో చేసే స్వీట్లు చాలానే ఉన్నాయి. అందులో లడ్డూలు, లౌజులు ముందు వరుసలో ఉంటాయి. అయితే ఎప్పుడూ ఇవే కాకుండా కొబ్బరితో ఓసారి హల్వా చేయండి. నిమిషాల్లో ప్రిపేర్​ అయ్యే ఈ రెసిపీ టేస్ట్​ చాలా బాగుంటుంది.

Coconut Halwa
How to Prepare Coconut Halwa (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2024, 1:54 PM IST

How to Prepare Coconut Halwa:మన నిత్య జీవితంలో ప‌చ్చి కొబ్బ‌రిని విరివిగా ఉపయోగిస్తాము. పచ్చళ్లు, రైస్​, స్వీట్స్​ అంటూ వాటితో రకరకాలు చేసుకుంటుంటాం. ఇక స్వీట్స్​ విషయానికి వస్తే ప‌చ్చి కొబ్బ‌రితో లడ్డూలు, లౌజులు చేసుకుంటాము. అయితే ఇవే కాకుండా పచ్చి కొబ్బరితో చేసుకునే వాటిలో హల్వా కూడా ఒకటి. బెల్లం, ప‌చ్చి కొబ్బ‌రి క‌లిపి చేసే ఈ హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు లేదా దేవుళ్లకు నైవేద్యంగా ఈ హ‌ల్వాను త‌యారు చేసి పెట్ట‌వ‌చ్చు. ఇది చేయడానికి ఎక్కవ సమయం కూడా పట్టదు. అయితే ఈ హల్వాను రెండు పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఆ పద్ధతులు? కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మొదటి పద్ధతి:

కావాల్సిన పదార్థాలు:

  • పచ్చి కొబ్బరి తురుము - రెండు కప్పులు
  • బెల్లం - కప్పు
  • యాలకుల పొడి - 1 టేబుల్​ స్పూన్​
  • జీడిపప్పు - 10
  • నెయ్యి - తగినంత

తయారీ విధానం:

  • మిక్సీజార్​ తీసుకుని అందులోకి పచ్చి కొబ్బరి తురుము, బెల్లం తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి అడుగు మందం ఉన్న పాన్​ పెట్టి రెండు టేబుల్​ స్పూన్ల నెయ్యి వేసి.. జీడిపప్పు పలుకులు వేసి ఎర్రగా వేయించి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే పాన్​లో గ్రైండ్​ చేసుకున్న కొబ్బరి పేస్ట్​ వేసుకుని లో ఫ్లేమ్​లో కొబ్బరి మిశ్రమం ముద్దగా అయ్యి పాన్​కు అంటుకోకుండా సెపరేట్​ అయినప్పుడు దింపేసుకోవాలి. ఇలా ప్రిపేర్​ అవ్వడానికి సుమారు 20 నిమిషాలు పడుతుంది. ఈ ఇరవై నిమిషాలు కూడా మంట సిమ్​లోనే ఉంచి కలుపుతూనే ఉండాలి.
  • మిశ్రమం దగ్గరపడిన తర్వాత యాలకులు పొడి, వేయించుకున్న జీడిపప్పు వేసి కలుపుకోవాలి. దింపేముందు ఓ టేబుల్​ స్పూన్​ నెయ్యి వేసి కలిపి స్టవ్​ ఆఫ్​ చేసుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి హల్వా రెడీ..

అందం నుంచి ఆరోగ్యం వరకు - కొబ్బరి పాలతో కోటి ప్రయోజనాలు - జస్ట్ ఇలా తీసుకుంటే చాలు!

రెండో పద్ధతి:

కావాల్సిన పదార్థాలు:

  • పెసరపప్పు - అర కప్పు
  • పచ్చి కొబ్బరి తురుము - 2 కప్పులు
  • బెల్లం - కప్పున్నర
  • బియ్యం పిండి - 2 టేబుల్​ స్పూన్​
  • యాలకుల పొడి - టేబుల్​ స్పూన్​
  • ఉప్పు - చిటికెడు
  • నీరు - సరిపడా
  • నెయ్యి - సరిపడా
  • జీడిపప్పు పలుకులు - 10
  • ఎండు ద్రాక్ష - 10

తయారీ విధానం:

  • ముందుగా పెసరపప్పును దోరగా వేయించుకుని పొడి చేసి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీజార్​ తీసుకుని అందులోకి పెసరపప్పు పొడి, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం, బియ్యం పిండి, యాలకుల పొడి, ఉప్పు, కొద్దిగా నీరు పోసి మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి రెండు టేబుల్​ స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్​ వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.
  • ఇప్పుడు అదే పాన్​లో గ్రైండ్​ చేసుకున్న మిశ్రమం వేసుకుని సన్నని మంట మీద నెయ్యి పైకి తేలేంతవరకు వేయించుకోవాలి. సుమారు ఈ మిశ్రమం దగ్గర పడటానికి 20 నిమిషాలు పడుతుంది.
  • ఆ తర్వాత మరికొంచెం నెయ్యి, వేయించిన డ్రైఫ్రూట్స్​ వేసుకుని దింపేసుకుంటే సరి. ఎంతో రుచికరంగా ఉండే హల్వా రెడీ!

ఆహా అనిపించే "తమిళనాడు వెడ్డింగ్​ స్టైల్ కొబ్బరన్నం"- నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండి! - టేస్ట్ అద్భుతం!

పిండి, నెయ్యి అక్కర్లేదు - కేవలం పాలు, చక్కెరతో బ్రహ్మాండమైన "మిల్క్ గులాబ్ జామూన్" రెడీ!

శ్రావణమాసం స్పెషల్ : పక్కా కొలతలతో గుడిలో పెట్టే "పరమాన్నం" - నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

ABOUT THE AUTHOR

...view details