తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

చపాతీలోకి రొటీన్ కర్రీలు బోర్​ - దాబా స్టైల్​ "పనీర్​ బుర్జీ" చేసుకోండి - కిర్రాక్​ కాంబినేషన్! - HOW TO MAKE PANEER BHURJI AT HOME

- అతి తక్కువ సమయంలో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు!

How to Make Paneer Bhurji at Home
How to Make Paneer Bhurji at Home (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2025, 2:56 PM IST

How to Make Paneer Bhurji at Home:ఎగ్ బుర్జీ చాలా మందికి ఫేవరెట్​ రెసిపీ. ఎందుకంటే నిమిషాల్లో ప్రిపేర్​ చేసుకోవడంతో పాటు సూపర్​ టేస్ట్​ ఉంటుంది కాబట్టి. అయితే ఎప్పుడూ ఒకే రకమైన బుర్జీ తింటే బోరింగ్​గా అనిపిస్తుంది. అలాంటి సమయంలో ఓ సారి పనీర్​ బుర్జీ ట్రై చేయండి. సరికొత్త టేస్ట్​తో వహ్వా అనిపిస్తుంది. పైగా దీనిని ప్రిపేర్​ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైమ్​ అవసరం లేదు. కేవలం నిమిషాల్లో ప్రిపేర్​ చేసుకోవచ్చు. ఈ బుర్జీ కోసం ఎక్కువ మసాలాలూ అవసరం లేదు. ఇక చపాతీల్లోకిపర్ఫెక్ట్​. మరి లేట్​ చేయకుండా ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

  • నూనె - తగినంత
  • బటర్​ - 1 టేబుల్​ స్పూన్​
  • జీలకర్ర - 1 టీ స్పూన్​
  • ఉల్లిపాయ - 1
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ -1 టేబుల్​ స్పూన్​
  • పచ్చిమిర్చి - 2
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • శనగపిండి - 1 టేబుల్​ స్పూన్​
  • టమాటలు - 2
  • పసుపు - పావు టీ స్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - 2 టీ స్పూన్లు
  • ధనియాల పొడి - 1 టీ స్పూన్​
  • జీలకర్ర పొడి - 1 టీ స్పూన్​
  • గరం మసాలా - అర టీ స్పూన్​
  • కసూరీ మేథీ - 1 టీ స్పూన్​
  • నీళ్లు - ఒకటిన్నర కప్పులు
  • పనీర్​ -150 గ్రాములు
  • ఫ్రెష్​ క్రీమ్​ - 1 టేబుల్​ స్పూన్​
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం:

  • ముందుగా ఓ బౌల్​లోకి పనీర్​ను సన్నగా తరుముకోవాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలను సన్నగా కట్​ చేసుకుని పక్కన పెట్టాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె, బటర్​ వేసుకోవాలి. బటర్​ కరిగిన తర్వాత జీలకర్ర వేసి చిటపటలాడించాలి.
  • జీలకర్ర వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఆనియన్స్​ రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చి వాసన పోయేవరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు శనగపిండి వేసి బాగా కలుపుతూ సిమ్​లో ఓ రెండు నిమిషాలు ఫ్రై చేయాలి.
  • ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి. అనంతరం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి.
  • టమాటా ముక్కలు మగ్గి నూనె పైకి తేలిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కసూరీ మేథీ వేసి మసాలాలు మాడిపోకుండా ఓ నిమిషం పాటు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత ఒకటిన్నర కప్పుల నీరు పోసి బాగా కలిపి ఓసారి ఉప్పు చూసుకోవాలి. సాల్ట్​ సరిపోకపోతే మరికొంచెం వేసి కలిపి మూత పెట్టి నీళ్లు మరిగించుకోవాలి.
  • వాటర్​ బాయిల్​ అవుతున్నప్పుడు సన్నగా తురిమిన పనీర్​ వేసి బాగా కలిపి ఓ 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్​లో మగ్గించాలి.
  • చివరగా ఫ్రెష్​ క్రీమ్​, కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్​ ఆఫ్​ చేసి సర్వ్​ చేసుకుంటే సూపర్​ టేస్టీ పనీర్​ బుర్జీ రెడీ.

అద్దిరిపోయే టిప్​తో "అల్లం చట్నీ" - రోడ్​ సైడ్​ టిఫెన్ బండ్ల సీక్రెట్ ఇదే!

క్రిస్పీ అండ్​ టేస్టీ "జొన్న దిబ్బరొట్టెలు" - షుగర్​ పేషెంట్స్​ హాయిగా తినొచ్చు - చేయడం చాలా ఈజీ!

ABOUT THE AUTHOR

...view details