ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

"కోడి గుడ్డు గ్రేవీ కర్రీ" ఇలా చేయండి - రైస్, చపాతీ, బిర్యానీల్లోకి సూపర్ - EGG GRAVY CURRY RECIPE

కోడి గుడ్లు ఇలా వండుకుని చూడండి - గ్రేవీ రుచి ఎప్పటికీ మర్చిపోలేరు!

egg_gravy_curry_recipe_process_in_telugu
egg_gravy_curry_recipe_process_in_telugu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2025, 2:24 PM IST

Egg Gravy Curry Recipe Process in Telugu :కోడిగుడ్లు దాదాపు ప్రతి ఇంట్లో సర్వ సాధారణ వంటకం. ఆమ్లెట్, బాయిల్డ్ ఎగ్, గుడ్ల పొడి ఇలా ఎన్నో రకాలుగా తయారు చేసుకుంటారు. అయితే, కోడి గుడ్లతో గ్రేవీ కర్రీ ఎంతో రుచిగా ఉంటుంది. గుడ్లు ఉడకబెట్టి నార్త్ ఇండియన్ స్టైల్​లో మసాలా పదార్థాలతో చేసుకునే గ్రేవీ ఎంతో స్పెషల్. ఎప్పుడైనా సరే ఇలా చేసుకుంటే రైస్, రోటీ, బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది. కోడిగుడ్ల గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా!

పూరీలు నూనె పీల్చకుండా పొంగాలంటే పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు! - సింపుల్ ట్రిక్

egg_gravy_curry_recipe_process_in_telugu (ETV Bharat)

కావల్సిన పదార్థాలు

  • ఉడికించిన కోడి గుడ్లు -6
  • నూనె - 4 టేబుల్ స్పూన్
  • పసుపు - 1/2 టేబుల్ స్పూన్
  • ఎర్ర కారం - 2 1/2 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు - 1 1/4 టేబుల్ స్పూన్
  • టమోటాలు - 2
  • పుదీనా - కొద్దిగా
  • కొత్తిమీర ఆకులు
  • పచ్చిమిర్చి - 4
  • వెల్లుల్లి - 5
  • అల్లం - చిన్న ముక్క
  • లవంగాలు - 5
  • యాలకులు - 3
  • జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్
  • ఉల్లిపాయలు - 4
  • గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్
  • జీలకర్ర పొడి - 1/4 టేబుల్ స్పూన్
  • ఉప్పు - 1 టేబుల్ స్పూన్
  • కరివేపాకు రెమ్మలు - 2
  • పెరుగు - 1 కప్పు
  • గ్లాసు నీరు - 1
  • కసూరి మేతి - 1/2 టేబుల్ స్పూన్

ఈ చిట్కాలతో కల్తీ పన్నీర్‌ను మీరే గుర్తించండి! - మార్కెట్​లో సింథటిక్ పన్నీర్ - తస్మాత్ జాగ్రత్త!

egg_gravy_curry_recipe_process_in_telugu (ETV Bharat)

ఎగ్ గ్రేవీ కర్రీ తయారు చేసుకునే విధానం

  • ఎగ్ గ్రేవీ కర్రీ కోసం ముందుగా ఆరు కోడిగుడ్లు బాగా ఉడికించుకోవాలి. లోపల ఉండే పచ్చని సొన బాగా ఉడికేలా చూసుకోవాలి. ఉడికించిన కోడిగుడ్లను అడ్డంగా రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి.
  • ఓ పెనంలో నూనె పోసుకుని అది వేడెక్కిన తర్వాత చిటికెడు కారం, ఉప్పు, పసుపు వేసుకుని గుడ్డు ముక్కలను ఫ్రై చేసుకోవాలి. గుడ్లు చిదిరిపోకుండా కోసిన భాగం వైపు నూనెలో బోర్లించుకుంటే పచ్చ సొనలోకి నూనె, కారం, పసుపు, ఉప్పు దిగి రుచిగా ఉంటాయి. ఫ్రై చేసుకున్న గుడ్లను పక్కన పెట్టుకోవాలి.
  • మరో వైపు రెండు మూడు టమోటాలు ముక్కలు చేసుకుని మిక్సీలో వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇది కర్రీకి చాలా ఫ్లేవర్ అందిస్తాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. దీంట్లోనే పచ్చి మిర్చి, వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి.
  • ఈ మిశ్రమం రెడీ కాగానే స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని
  • నూనె, చెక్క, లవంగాలు, యాలకులు, జిలకర, ఉల్లిగడ్డ తురుము వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ త్వరగా మెత్తపడాలంటే అందులో ఉప్పు వేసుకోవాలి.
  • ఆ తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కరివేపాకు వేసుకుని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు బాగా వేగి నూనె పైకి తేలాలి.
  • నూనె పైకి తేలిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ వేసుకుని కలుపుకొని బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత కప్పు పెరుగు వేసుకుని మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ సమయంలో నీళ్లు పోసుకుని రుచి చూసుకుని ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. నాలుగైదు నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు వేసుకుని కసూరి మేతి వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది. మరో రెండు నిమిషాలు దమ్ ఇచ్చాక కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది.

ఎప్పుడూ ఇడ్లీ, దోసెలేనా? - రాగిపిండితో ఇలా చేయండి - ఫ్యామిలీ అంతా మీకు ఫ్యాన్స్ అవుతారు!

దోసెలు అప్పటికప్పుడు ఇలా చేసుకోండి - రుచికరమైన "బబుల్ దోసెలు"

ABOUT THE AUTHOR

...view details