తెలంగాణ

telangana

ETV Bharat / health

రోజూ వాల్​నట్స్​ తినే అలవాటు ఉందా? - మీ బాడీలో జరిగేది ఇదే! - Walnuts Eat Every Day

Health Benefits of Walnuts: ఆరోగ్యంగా ఉండడంలో డ్రై ఫ్రూట్స్ పాత్ర ఏంటనేది అందరికీ తెలిసిందే. ఇందులో బాదం నుంచి కాజూ వరకూ చాలా మంది ఆరగిస్తుంటారు. అయితే.. వాల్​నట్స్​ కూడా ఎక్కువగానే తింటారు. మరి.. దీన్ని రోజూ తినడం వల్ల మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Health Benefits of Walnuts
Benefits of Walnuts

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 11:53 AM IST

Walnuts Eat Every Day What Happens in Your Body? :ఈ ఆధునిక యుగంలో జనాల్లో క్రమంగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెరుగుతోంది. ఇందులో భాగంగా చాలా మంది డ్రై ఫ్రూట్స్(Dry Fruits)​ తీసుకుంటున్నారు. అయితే.. డ్రై ఫ్రూట్స్​లో రారాజుగా పిలిచే వాల్​నట్స్ రోజూ మార్నింగ్ తీసుకున్నారంటే.. మీ బాడీలో పలు మార్పులు చోటుచేసుకోవడం ఖాయమంటున్నారు నిపుణులు. మరి.. ఆ మార్పులేంటి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది :వాల్​నట్స్​లో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం వంటి అనేక పోషకాలు కూడా పుష్కలం. వీటిని తీసుకుంటే గుండెకు ఎక్కువ మేలు జరుగుతుందని నిపుణలు చెబుతున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్​ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే వాల్​నట్​లు అధిక రక్తపోటు ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

గట్ సిస్టమ్ మెరుగుపడుతుంది :వాల్‌నట్స్‌లో బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధులను ప్రభావితం చేసే గట్ సిస్టమ్ దెబ్బతినకుండా​ ఆరోగ్యంగా ఉండడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే వీటిలో ఉండే పీచు పదార్థం జీర్ణ సమస్యలను దూరం చేయడంలో ఎంతో మేలు చేస్తుంది. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. అధిక బరువు, ఊబకాయం ఉన్న వారి ఆహారంలో వాల్‌నట్‌లను చేర్చడం వల్ల రక్తపోటు స్థాయిలను గణనీయంగా తగ్గించడంలో సహాయపడే ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియాను మెరుగుపరిచింది.
మహిళలు రోజూ డ్రైఫ్రూట్స్ తింటే ఆ సామర్థ్యం డబుల్!

మెదడుకు మేలు చేస్తాయి : వాల్‌నట్‌లను క్రమం తప్పకుండా తినడం వల్ల ముఖ్యంగా వయసు మళ్లిన తర్వాత వచ్చే మానసిక ఆందోళనలు తగ్గుతాయి. పలు అధ్యయనాల ప్రకారం.. వాల్‌నట్‌లోని పాలీఫెనోలిక్ సమ్మేళనాలు మెదడు కణాలలో వాపును తగ్గిస్తాయి. అదేవిధంగా కొత్త కణాలను ఏర్పరుస్తాయి. ముఖ్యంగా వీటిలోని ఎసెన్షియల్‌ ఫ్యాటీ ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి : ప్రతిరోజూ వాల్‌నట్‌లను తినడం వల్ల మీ శక్తి స్థాయిలను కూడా పెంచుకోవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారు రోజూ నానబెట్టిన వల్ల తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. అలాగే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. బరువు నియంత్రణకు, రక్తహీనత నివారణకు ఇవి చాలా బాగా పనిచేస్తాయి.

రోజుకు ఎన్ని తినాలంటే.. వాల్​నట్​లను ముందురోజు రాత్రి నానబెట్టి తర్వాత రోజు మార్నింగ్ తింటే మంచి ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి. కానీ, చాలా మందికి రోజూ నానబెట్టి తినడం సాధ్యం కాదు. అలాంటి వారు వీటిని సలాడ్​లు, సూప్​లు, ఫ్రై చేసుకునే కర్రీలలో యాడ్ చేసుకోవచ్చు. లేదంటే తరిగిన వాల్​నట్​లు లేదా పొడిని పెరుగు లేదా ఓట్​మీల్​లో కలిపి కూడా తీసుకోవచ్చు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ 50-60gm తినడం మంచిదట.

వయసును తగ్గించే డ్రైఫ్రూట్స్.. మీరు వీటిని తింటున్నారా!

వింటర్​ సూపర్​ ఫుడ్​.. మీ డైట్​లో తప్పక ఉండాల్సిన డ్రైఫ్రూట్స్ ఇవే

ABOUT THE AUTHOR

...view details