తెలంగాణ

telangana

ETV Bharat / health

క్యాన్సర్​ నుంచి డీహైడ్రేషన్​ వరకు - తాటి ముంజలతో ఎన్నో బెనిఫిట్స్​! - Ice Apple Health Benefits

Ice Apple Health Benefits: సమ్మర్​ వచ్చిందంటే మామిడి, పుచ్చకాయతో పాటు దొరికే మరో పండు తాటి ముంజలు. ఈ తాటి ముంజల్లో ఉండే పోషకాలు డీహైడ్రేషన్​ నుంచి క్యాన్సర్​ వరకు అన్ని రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Ice Apple Health Benefits
Ice Apple Health Benefits

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 3:05 PM IST

Ice Apple Health Benefits:వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో తాటి ముంజలు కూడా ఒకటి. ఇవి చూడటానికి పైన గోధుమ రంగులో, లోపల తెల్లగా ఉండి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత సాఫ్ట్​గా ఉంటాయి. తియ్యగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపలి భాగంలో నీరు ఉంటుంది. ఈ పండునే 'ఐస్ యాపిల్' అని కూడా అంటారు. ఎండాకాలం ప్రారంభం కాగానే మార్కెట్లో తాటి ముంజలు దర్శనమిస్తాయి. ఈ తాటి ముంజల్లో ఉండే పోషకాలు.. ఆరోగ్యానికి అదే విధంగా అందానికి కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పోషకాలు పుష్కలం:ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కాల్షియం, ఫైటోన్యూట్రియెంట్లు, విటమిన్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, జింక్​, ఫాస్పరస్​​​ అధికంగా లభిస్తాయి. ఎండాకాలంలో మాత్రమే లభించే తాటి ముంజలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక విధాలుగా మేలు చేస్తుంది. మరి దీని ప్రయోజనాలు చూస్తే..

క్యాన్సర్ల నుంచి రక్షణ: తాటి ముంజలు.. వివిధ రకాల ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే ఫైటోకెమికల్స్, ఆంథోసయనిన్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి. అందువల్ల ఈ పండుని ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ల నుంచి కూడా రక్షణ పొందవచ్చు. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి.. శరీరానికి కావాల్సిన మినరల్స్, న్యూట్రియంట్ల శాతాన్ని బ్యాలన్స్ చేయడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. 2018లో "పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్" జర్నల్​ ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. తాటి ముంజలు తినే వ్యక్తులు కొన్ని రకాల క్యాన్సర్​ బారిన పడే అవకాశం తక్కువగా ఉందని కనుగొన్నారు. ముఖ్యంగా, తాటి ముంజలు తినడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్​, బ్రెస్ట్​ క్యాన్సర్​, ఊపిరితిత్తుల క్యాన్సర్​ రిస్క్​ తగ్గుతుందని కనుగొన్నారు. తాటి ముంజలలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించడంలో సహాయపడతాయని కనుగొన్నారు.

అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా? - మీ సాల్ట్​ ఇలా టెస్ట్​ చేసుకోండయ్యా!

బరువు తగ్గొచ్చు:తాటి ముంజల్లో శరీరానికి కావాల్సిన ఎ, బి, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం.. వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహకరిస్తుందని, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని ప్రముఖ పోషకాహార నిపుణురాలు డా. అంజలీదేవీ తెలిపారు.

కాలేయ సమస్యలు: తాటి ముంజలు కాలేయ సంబంధ సమస్యల్ని కూడా తగ్గిస్తాయి. ఈ పండులో అధిక మొత్తంలో ఉండే పొటాషియం శరీరంలో ఉండే విషపదార్థాలను తొలగిస్తుందని డా. అంజలీదేవీ తెలిపారు .

డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం: ఎన్ని నీళ్లు తాగినాఎండాకాలంలో డీహైడ్రేట్ అయిపోవడం సర్వసాధారణం. అయితే ముంజల్లో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల వీటిని తింటే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడుకోవచ్చని డా. అంజలీదేవీ అంటున్నారు. వేసవిలో శరీరానికి కావాల్సిన ఖనిజాలు, చక్కెరలను ఇవి బ్యాలన్స్ చేస్తాయని.. వీటిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ బి, ఐరన్, క్యాల్షియం శరీరానికి చాలా అవసరమని ఆమె తెలిపారు.

అలర్ట్​: శానిటైజర్​ డైలీ వాడుతున్నారా? - ఏకంగా మెదడుకే ముప్పు!

గర్భిణులకూ మంచిదే:ప్రెగ్నెన్సీ సమయంలో కొంతమందికి ఏ ఆహారం తిన్నా జీర్ణం కాకపోవడం వంటి సమస్య ఎదురవుతుంది. అలాంటి వారు ముంజల్ని తింటే ఫలితం ఉంటుంది. జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా.. ఈ సమయంలో ఎదురయ్యే మలబద్ధకం, ఎసిడిటీ.. లాంటి ఆరోగ్య సమస్యల్ని కూడా ఈ పండ్లు దూరం చేస్తాయని నిపుణులు అంటున్నారు.

అలసట దూరం:వేసవిలో కొద్దిసేపు బయటికి వెళ్లొస్తేనే అలసిపోతాం. అంతేకాదు.. విపరీతమైన చెమట కూడా పట్టేస్తుంది. ఫలితంగా శరీరం అధిక మొత్తంలో నీటిని కోల్పోతుంది. ఈ క్రమంలో శరీరం కోల్పోయిన నీటిని తిరిగి అందించి, అలసట నుంచి ఉపశమనం పొందడానికి తాటి ముంజల్ని తినడం ఒక సులువైన మార్గం అంటున్నారు నిపుణులు.

పొట్టు తీయకుండా తినాలి: ఇకచాలామంది ముంజలను పొట్టు తీసేసి తింటారు. కానీ ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలుంటాయి. అలాగే ఈ పొట్టు వల్లే శరీరానికి ఎక్కువ చలువ చేస్తుంది. కాబట్టి తాటి ముంజల్ని పొట్టు తీయకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిది.

అందానికి కూడా:

  • కొంతమందికి ఎండాకాలంలో వేడికి ముఖంపై చిన్న చిన్న మొటిమల్లా వస్తుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ముంజలను తినడం మంచిది.
  • తాటి ముంజలు వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. ముఖం మెరిసేలా చేస్తుంది. మొటిమలు, మచ్చలు, ముడతలు రాకుండా అడ్డుకుంటుంది.
  • తాటి పండు జుట్టు పొడిబారకుండా చేస్తుంది. నిర్జీవమైన జుట్టుని రిపేర్ చేస్తుంది. అలాగే జుట్టు చిట్లి పోవడం, తెల్ల జుట్టు, బట్టతల రాకుండా చేయడంలో తాటి ముంజలు గొప్పగా పని చేస్తాయి.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఫెయిర్​నెస్ క్రీమ్ వాడే అలవాటు ఉందా? - అయితే అలర్ట్ అవ్వండి - లేదంటే మీ కిడ్నీలు ఖతం!

పచ్చి మామిడికాయలు తింటే వెయిట్​ లాస్​- ఈ లాభాలు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details