తెలంగాణ

telangana

ETV Bharat / health

కళ్ల కింద డార్క్ సర్కిల్స్​తో ఇబ్బందా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఈజీగా పోతాయట! - DARK CIRCLES REMOVE TIPS

-కళ్ల కింద నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతున్నారా? -ఇంట్లోనే ఉండే ఈ పదార్థాలతో అన్నీ మాయమవుతాయట!

dark circles remove tips
dark circles remove tips (Getty Images)

By ETV Bharat Health Team

Published : 8 hours ago

Dark Circles Home Remedy:మనలో కొందరికి కళ్ల కింద నల్లటి వలయాలు (డార్క్ సర్కిల్స్), చర్మం ఉబ్బినట్లు కనిపిస్తుంది. నిద్రలేమి, ఐరన్ లోపం, డీ హైడ్రెషన్ లాంటి సమస్యల వల్ల కూడా నల్లటి వలయాలు వస్తాయని ప్రముఖ డెర్మటాలజిస్ట్ శైలజ సూరపనేని వివరిస్తున్నారు. ఫలితంగా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఎలాగైనా ఈ సమస్యను తగ్గించుకోవాలని వైద్యుల సలహాలతో పాటు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించి ఈ సమస్యను సులువుగా అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బాదం నూనె: బాదం నూనె కళ్లకు ఉపశమనాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్‌ కె ఎక్కువగా ఉండే బాదం నూనె యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేసి కళ్లకింద వాపు తగ్గిస్తుందన్నారు. క్రమంగా చర్మ రంగునీ మెరుగుపరుస్తుందని వివరిస్తున్నారు. అందుకే, రోజూ నిద్రపోయే ముందు రెండు చుక్కలతో మృదువుగా రెండు మూడు నిమిషాలైనా మర్దన చేస్తే ఫలితం కనిపిస్తుందని అంటున్నారు.

దోసకాయ ముక్కలు: కళ్ల కింద డార్క్ సర్కిల్స్ తగ్గించడంలో దోసకాయ ముక్కలు బాగా సాయపడతాయని నిపుణులు అంటున్నారు. 2013లో Journal of Cosmetics, Dermatological Sciences and Applicationsలో ప్రచురితమైన "Skin Cooling and Anti-Inflammatory Effects of Cucumber (Cucumis sativus) Slices"లోనూ ఈ విషయం తేలింది. దోసకాయ ముక్కలను సన్నగా కోసి.. వాటిని 10-12 నిమిషాలపాటు కళ్లపై ఉంచాలని వివరిస్తున్నారు. ఫలితంగా డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయని చెబుతున్నారు.

టమాటా: కళ్ల కింద నల్లటి వలయాల్ని తొలగించడంలో టమాటా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో సమాన పరిమాణంలో నిమ్మరసం, టామాటా గుజ్జుని తీసుకుని ఆ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ నెమ్మదిగా మర్దనా చేయాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే నల్లటి వలయాలు క్రమంగా దూరమవుతాయని వివరిస్తున్నారు. ఇలా రోజుకి రెండు సార్లు చేయగలిగితే మంచి ఫలితమూ కనిపిస్తుందని అంటున్నారు.

టీ బ్యాగులు: మనం వాడేసిన టీ బ్యాగ్స్ కళ్ల నల్లటి వలయాలను పోగొట్టడంలో బాగా సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. ఈ బ్యాగులను మరోసారి గోరువెచ్చని నీళ్లలో ముంచి తీసి వాటిని మూసిన కళ్లపై ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాపు తగ్గడమే కాకుండా.. నల్లటి వలయాలు దూరమవుతాయని చెబుతున్నారు.

కలబంద జెల్​: కలబంద జెల్​తో కళ్ల కింద 5-7 నిమిషాల పాటు మర్దన చేసుకోని ఆ తర్వాత శుభ్రంగా నీటితో కడుక్కోవాలట. ఇలా చేయడం వల్ల కళ్ల డార్క్ సర్కిల్స్ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

యూరిక్ యాసిడ్​ ఎక్కువై ఇబ్బంది పడుతున్నారా? ఈ డైట్ పాటిస్తే 'గౌట్' తగ్గిపోతుందట!

డైటింగ్ చేయకుండానే బరువు తగ్గాలా? ఇలా చేస్తే ఈజీగా నాజుగ్గా మారిపోతారట!

ABOUT THE AUTHOR

...view details