Vijay Devarkonda Dil Raju New Movie : విజయ్ దేవరకొండ కెరీర్లో ప్రస్తుతం ప్లాప్స్ మాత్రమే పలకరిస్తున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో ఎన్నో అంచనాల మధ్య రీసెంట్గా విడుదలైన ఫ్యామిలీ స్టార్ కూడా డిజాస్టర్‌గా మిగిలింది. అంతకు ముందు వచ్చిన మూవీస్ కూడా ఆయన కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. అయితే ఆయన మరోసారి దిల్‌రాజుతో కలిసి సినిమా చేసేందుకు రెడీ అయినట్లు ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి రాజావారు రాణివారు మూవీ డైరెక్టర్ రవి కిరణ్ దర్శకత్వం వహించనున్నారని ప్రచారం సాగింది.
అయితే తాజాగా ఈ మూవీ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తమ 59వ సినిమాగా దీనిని రూపొందించబోతున్నట్లు సోషల్ మీడియా అకౌంట్లో అధికారికంగా ప్రకటించింది. రవి కిరణ్‌తోనే ఈ సినిమా చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చింది. దిల్ రాజు శిరీశ్‌తో కలిసి ఈ సినిమా చేయబోతున్నట్లు తెలిపింది. లార్జర్ డెన్ లైఫ్‌గా అంటే భారీ బడ్జెట్‌తో రూరల్ యాక్షన్ డ్రామాగా సినిమా రాబోతుందని చెప్పారు మేకర్స్. మరిన్ని వివరాలను మే 9న ప్రకటిస్తామని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ మేరకు దిల్‌రాజు, రవి కిరణ్, విజయ్ దేవరకొండ కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రౌడీ హీరో ఫ్యాన్స్ అంతా మే 9కోసం ఎదురుచూస్తూ ఉంటామని కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ మూవీకి టైటిల్ రౌడీ జనార్దన్ అనే పేరును ఫిక్స్ చేసినట్టు వార్తలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ పేరు కూడా డిఫరెంట్‌గా విజయ్ బ్రాండ్‌కు తగ్గట్టుగా ఉందంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం విజయ్ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీదనే విజయ్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇది షూటింగ్ జరుపుకుంటోంది. మొదట ఈ మూవీలో విజయ్ సరసన శ్రీలీల అనుకున్నారు కానీ ఏమైందో ఏమో శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత రష్మిక అన్నారు. అనంతరం మరో మలయాళ భామను హీరోయిన్గా తీసుకునే అవకాశం ఉంది అని ప్రచారం సాగుతోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తవ్వగానే లేదా ముందుగానే రవి కిరణ్ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. కాగా, రవి కిరణ్ కోలా రాజావారు రాణివారు తర్వాత అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాకు స్క్రీన్ రైటర్‌గా కూడా పనిచేశారు. ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేసే సినిమా ఆయనకు రెండో చిత్రం అవుతుంది.
దిల్‌రాజుతో రౌడీ హీరో కొత్త సినిమా అనౌన్స్మెంట్ - దర్శకుడు ఎవరంటే? - Vijay Devarkonda Dilraju - VIJAY DEVARKONDA DILRAJU
Vijay Devarkonda Dil Raju New Movie : దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ మరో కొత్త సినిమాను ప్రకటించారు. పూర్తి వివరాలు స్టోరీలో

Vijay Devarkonda (Source ANI)
Published : May 4, 2024, 11:44 AM IST
|Updated : May 4, 2024, 12:52 PM IST
Last Updated : May 4, 2024, 12:52 PM IST