Tollywood Directors Daughters : టాలీవుడ్లో ఎంతోమంది సక్సెస్ఫుల్ డైరెక్టర్లు ఉన్నారు. వారి గురించి చాలా మందికి తెలిసినప్పటికీ వారి ఫ్యామిలీ గురించి మాత్రం అంతగా తెలియకపోవచ్చు. అసలు డైరెక్టర్ల ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు చాలా తక్కువగా బయటకు వస్తుంటాయి. అదంతా ఒక్కప్పుడు. ఇప్పుడు కాలం మారింది. సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. ఎవరు ఏం చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంది. అలా మన స్టార్ డైరెక్టర్ల తమ ఫ్యామిలీకి సంబంధించిన పలు మధుర క్షణాలను షేర్ చేస్తుంటారు. తమ మద్దుల తనయన ఘనతలను చెప్పుకుంటుంటారు. పేరుకు డైరెక్టర్ల పిల్లలే కావచ్చు వారిలో టాలెంట్ చూస్తే మాత్రం తండ్రులకు తగ్గ తనయలు అనక తప్పదు. మరి అలా తండ్రుల పేర్లను నిలబెడుతున్న టాలీవుడ్ డైరెక్టర్ ముద్దుల తనయల గురించి ఇప్పుడు చూద్దాం.
పూరి జగన్నాథ్-పవిత్ర :
పూరి జగన్నాథ్ ముద్దుల తనయ పేరు పవిత్ర. పూరి తన వారసులను ఇండస్ట్రీకీ ఎప్పుడో పరిచయం చేశారు. తనయుడు ఆకాశ్ హీరోగా సినిమాల్లో నటిస్తుండగా, తనయ పవిత్ర కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో మెరిసింది. ప్రస్తుతం ఆమె డైరెక్షన్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తోందట.
సుకుమార్-సుకృతి :
సుకుమార్ గారాల పట్టి సుక్రుతి తనకంటూ ఓ సొంత యూట్యూబ్ ఛానెల్‌ను క్రియేట్ చేసుకుని పాపులరైంది. అందులో తాను పాడిన సాంగ్స్‌ను అప్లోడ్ చేస్తుంటుంది.
తేజ-ఐలా:
తేజ గురించి చాలా మందికి తెలిసినా ఆయన ముద్దుల బిడ్డ ఐలా గురించి ఎవ్వరికీ అంతగా తెలియదు. అమెరికాలో మాస్టర్స్ చదివిన ఐలా ఓ మంచి స్పీకర్. ఈమె అమెరికాలో బెర్కెలీ ఫోరమ్ తరపున పలు పొగ్రామ్స్లో పాల్గొంది.