Tamannaah Bhatia Angry : తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది నటి తమన్నా. అభిమానులు ఈమెను ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుస్తారు. రీసెంట్‌గానే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. అలా దాదాపుగా రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో రాణిస్తూ కెరీర్లో ముందుకెళ్తోంది.
తొలిసారి ఈమె 2005లో హిందీ సినిమా 'చాంద్ సా రోషన్ చెహ్రా'తో తెరంగేట్రం చేసింది. అదే ఏడాది 'శ్రీ' చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి అగ్ర కథానాయికగా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. కథ డిమాండ్ చేస్తే బోల్డ్ సీన్స్ కూడా చేస్తోంది. ప్రస్తుతం తమన్నా నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. 'అరణ్మనై 4', 'స్త్రీ 2', 'వేద', 'ఓదెల 2' వంటి సినిమాలు ఉన్నాయి.
అలా తనదైన యాక్టింగ్, గ్లామర్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ మిల్కీ భామ పర్సనల్ లైఫ్‌ను బాగానే బ్యాలెన్స్ చేస్తోంది. బాలీవుడ్లో సెటిల్ అయిన తెలుగోడు విజయ్ వర్మతో రిలేషన్షిప్ మెయిన్‌టెయిన్ చేస్తోంది. కానీ పెళ్లి గురించి చెప్పట్లేదు. బహిరంగంగానే తిరుగుతున్నారు. షూటింగ్స్‌లో కాస్త గ్యాప్ దొరికినా వెకేషన్స్, పార్టీలంటూ ఫుల్‌గా చిల్ కొడుతున్నారు.అయితే తాజాగా తమన్నాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయట కథనాల్లో కనిపించింది.