Sankrantiki Vastunnam :విక్టరీ వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం'తో థియేటర్లలో సందడి చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైన ఈ సినిమా భారీ విజయం దక్కించుకుంది. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకున్నట్లు సినీ వర్గాల టాక్.
హిట్ టాక్ అందుకున్న సంక్రాంతికి వస్తున్నాం మూవీ 6 రోజుల్లోనే రూ.100 కోట్ల షేర్ సాధించింది. అయితే ఇప్పటివరకు వెంకీ కెరీర్లో రూ.100కోట్లు షేర్ సాధించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. అలాగే సినిమా విడుదలై ఆరు రోజులైనా కలెక్షన్ల జోరు మాత్రం తగ్గట్లేదు. 'సంక్రాంతికి వస్తున్నాం సినిమా కేవలం 6 రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది' అని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పోస్టర్ రిలీజ్ చేసింది.
ఆరో రోజూ తగ్గని కలెక్షన్లు
సినిమా విడుదలైన ఆరో రోజు కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలో ఆరో రోజు నైజాం, ఆంధ్రా, సీడెడ్లో ఈ మూవీ రూ.22.56 కోట్ల వసూళ్లు సాధించింది. ఒక్క నైజాం ప్రాంతంలోనే రూ.4.21కోట్ల రికార్డు కలెక్షన్లు వసూల్ చేసింది.