RC 16 Shooting Update :'గేమ్ ఛేంజర్' అంటూ సంక్రాంతి బరిలోకి దిగిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు మరో సాలిడ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. 'ఆర్‌సీ 16' అనే వర్కింగ్ టైటిల్‌తో రానున్న సినిమాపై ఆయన ఫోకస్ పెట్టనున్నారు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ షూటింగ్లో ఆయన పాల్గొననున్నారు.
ఇప్పటికే చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ బుధవారం ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో ఇది జరగనుంది. రాత్రి వేళలో సాగే ఈ షెడ్యూల్‌లో చెర్రీతో పాటు మరికొందరు కీ స్టార్స్ పాల్గొననున్నారట. వారందరిపై సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు సమాచారం.
మరోవైపు ఈ నయా షెడ్యూల్ కోసం ఓ స్పెషల్ సెట్‌ను సిద్ధం చేసినట్లు సినీ వర్గాల మాట. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాలో బలమైన భావోద్వేగాలు ఉండనున్నాయని, ఇది పూర్తిగా ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం 'పెద్ది' అనే పేరును ఫిక్స్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.