తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కన్నప్ప నుంచి మరో అప్డేట్- ప్రభాస్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ - PRABHAS KANNAPPA

కన్నప్ప సినిమా నుంచి మరో అప్డేట్- రెబల్ స్టార్ పోస్టర్ చూశారా?

Prabhas Kannappa
Prabhas Kannappa (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2025, 1:42 PM IST

Prabhas Kannappa :మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'. 'మహాభారత్​' సిరీస్‌ తెరకెక్కించిన ముకేశ్ కుమార్‌ సింగ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నార్త్‌ నుంచి సౌత్‌ వరకు పలువురు స్టార్స్‌ భాగం అవుతున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఇందులో కీ రోల్​లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే మేకర్స్ ఒక్కొక్కరి ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ క్యారెక్టర్ గురించి అదిరే అప్డేట్ ఇచ్చారు.

ప్రభాస్ ఫస్ట్​ లుక్ ఫిబ్రవరి 3న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభాస్ పోస్టర్ ఒకటి షేర్ చేశారు. 'కన్నప్పలో ఇది డార్లింగ్ ప్రభాస్ గ్లింప్స్. ఫుల్ లుక్ ఫిబ్రవరి 3న రానుంది' అని రాసుకొచ్చారు. అయితే ఈ పోస్టర్​లో ప్రభాస్ కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. త్రిశూలం పట్టుకున్న రెబల్ స్టార్ పోస్టర్ ఫుల్ పవర్​ఫుల్​గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

నంది పాత్రలో ప్రభాస్
ఈ సినిమాలో ప్రభాస్‌ నంది పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 'కన్నప్ప' సినిమా షూటింగ్ ఎక్కువ భాగాన్ని న్యూజిలాండ్​లో చిత్రీకరించారు. అక్కడే ఈ సినిమా షూట్‌ చేయడానికి గల కారణాన్ని చెన్నైలో జరిగిన ప్రెస్‌ మీట్‌లో మేకర్స్ తెలియజేశారు. కన్నప్ప సినిమా మూడో శతాబ్ద కాలం నాటిదని, ఆనాటి ప్రకృతి రమణీయతను చిత్రంలో చూపించాల్సి ఉండడంతో న్యూజిలాండ్‌లో షూటింగ్ చేశామని పేర్కొన్నారు.

సినిమా విషయానికొస్తే, మహాకవి ధూర్జటి రాసిన శ్రీ కాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని ఈ కన్నప్ప చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ముకేశ్ కుమార్‌ సింగ్‌ ఈ చిత్రాన్ని డెరెక్ట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో మోహన్‌ బాబు నిర్మిస్తున్నారు. విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ప్రభాస్‌ గెస్ట్ రోల్​లో కనిపించనున్నారు. మోహన్‌ బాబు, శరత్‌ కుమార్‌, ప్రీతి ముకుందన్‌, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఏప్రిల్‌ 25న కన్నప్ప ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

మంచు విష్ణు 'కన్నప్ప'అప్డేట్- శివుడిగా బాలీవుడ్ హీరో- పోస్టర్ రిలీజ్

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్ - 'కన్నప్ప' రిలీజ్‌ డేట్ ఫిక్స్​

ABOUT THE AUTHOR

...view details