తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఇది మనందరి తప్పు' - అల్లు అర్జున్​ అరెస్ట్​పై స్పందించిన హీరో నాని - PUSHPA 2 ALLU ARJUN ARRE

అల్లు అర్జున్​ అరెస్ట్​పై స్పందించిన హీరో నాని - ఏమన్నారంటే?

Nani Reacts On AlluArjun Arrest
Nani Reacts On AlluArjun Arrest (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 9 hours ago

Nani Reacts On AlluArjun Arrest :'పుష్ప 2' ది రూల్‌ ప్రీమియర్‌ షోలో భాగంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో భాగంగా ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్‌ను ఈరోజు మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే దీనిని సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లతో పాటు పలువురు సెలబ్రిటీలు ఖండిస్తున్నారు. #WeStandWithAlluArjun అనే హ్యాష్‌ట్యాగ్‌ జతచేస్తూ తమ సపోర్ట్‌ తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై నటుడు నాని స్పందించారు. ఇది మనందరి తప్పు అని పేర్కొన్నారు. "సినిమా వాళ్లకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు, మీడియా చూపించే ఉత్సాహం సాధారణ పౌరులపై కూడా ఉండాలని కోరుకుంటున్నా. మనం మంచి సమాజంలో జీవించాలి. ఇదొక దురదృష్టకర, హృదయ విదారక ఘటన. ఈ డిజాస్టర్​ నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. ఇకపై మరిన్ని జాగ్రత్తలు పాటించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మనందరి తప్పు ఉంది. ఒక వ్యక్తిని నిందించడం కరెక్ట్‌ కాదు" అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. మరోవైపు దర్శకుడు అజయ్ భూపతి కూడా అల్లు అర్జున్‌ అరెస్ట్‌ను ఖండించారు. ఇది ఏమాత్రం సరైనది కాదని ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.

"ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నేను నమ్మలేకపోతున్నాను. ఈ ఘటన దురదృష్టకరం. హృదయాన్ని కలచివేస్తోంది. ఒకే వ్యక్తిని నిందించడం సబబు కాదు" - రష్మిక

"సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన హృదయ విదాకర సంఘటన మెరుగైన భద్రత అవసరాలను గుర్తు చేస్తుంది. అల్లు అర్జున్‌ ఒక్కరినే బాధ్యత వహించమనడం సరికాదు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుందాం" - అనిల్‌ రావిపూడి

"ఊహించని ఘటన విషయంలో ఒకే వ్యక్తి ఎలా బాధ్యత వహించగలరు? మనం ఈ ఘటన నుంచి నేర్చుకోవాల్సింది ఉంది. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి. లవ్‌ యూ అల్లు అర్జున్‌ అన్నా" -సందీప్‌ కిషన్‌

"ఇలాంటి ఘటనలు బాధాకరం. వాటిని ఎలా నిరోధించాలన్న (థియేటర్‌ వద్ద ఘటన) దాని గురించి ఆలోచించాలి. ఇది తప్పుపట్టడం కాదు. దాన్నుంచి మనం నేర్చుకోవాలి" - నితిన్‌

కాగా, సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అరెస్టైన అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. పోలీసులు ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ నెల 27 వరకు నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు రిమాండ్ విధించింది.

అల్లు అర్జున్ అరెస్ట్​పై స్పందించిన బాలీవుడ్ స్టార్ హీరో

వీకెండ్​ స్పెషల్ - ఒక్కరోజే 22 సినిమా/సిరీస్​లు - ఆ 4 చిత్రాలు వెరీ స్పెషల్!

ABOUT THE AUTHOR

...view details