Kannappa Movie Teaser : మంచు విష్ణు లీడ్ రోల్లో తెరకెక్కుతున్న సినిమా 'కన్నప్ప'. ముకేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నార్త్ నుంచి సౌత్ వరకు పలువురు స్టార్స్ భాగం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ నటుడు అక్షర్ కుమార్ శివుడి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా హిందీ టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో అక్షయ్‌కుమార్‌పై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివుడి గురించి ఈ తరంలో ఎవరు ఆలోచించినా అక్షయ్‌కుమార్ రూపమే గుర్తొస్తుందని అన్నారు.
'మోహన్‌బాబు కుమారుడిని అని చెప్పడానికి నేను గర్వపడతాను. ఆయన లేకపోతే నేను నటుడిని అయ్యేవాడిని కాదు. ఆయన కారణంగానే అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో నటించారు. షూటింగ్ సమయంలో అక్షయ్ నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. ఈ సినిమాలో చేసిన ప్రతిఒక్కరూ వారి పాత్రలకు 100 శాతం న్యాయం చేశారు. ఈ షూటింగ్ ప్రారంభం అయ్యాక, నాలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఉన్నతంగా ఆలోచిస్తున్నా. మోహన్‌లాల్, ప్రభాస్ అందరూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ తరంలో శివుడు అంటే మొదట గుర్తుకువచ్చే పేరు అక్షయ్‌కుమారే' అని విష్ణు చెప్పారు.
రెండుసార్లు రిజెక్ట్
'కన్నప్ప' సినిమా ఆఫర్ రెండుసార్లు రిజెక్ట్ చేసినట్లు అక్షర్ కుమార్ చెప్పారు. విష్ణు, మోహన్‌బాబు ఎన్నోసార్లు ఫోన్ చేశారని కానీ, బిజీగా ఉండడం వల్ల మాట్లాడలేకపోయానని అన్నారు. వీరిద్దరూ ఆఫీసుకు వచ్చి కలిసి మాట్లాడిన వెంటనే అంగీకరించినట్లు చెప్పారు. విష్ణు మాటల్లో నిజాయతీ కనిపించిందన్నారు.